ఇండోనేషియాలో విషాదం.. 127 మంది దుర్మరణం

శనివారం అర్థరాత్రి ఇండోనేషియాలోని తూర్పు జావాలోని మలాంగ్ నగరం, కంజురుహాన్ స్టేడియంలో జరిగిన పుట్ బాల్ మ్యాచ్‌లో ఘోరం జ‌రిగింది. స్టేడియంలో జ‌రిగిన‌ తొక్కిస‌లాట కార‌ణంగా 127 మంది మ‌ర‌ణించారు. మృతులో పోలీసులు కూడా…

శనివారం అర్థరాత్రి ఇండోనేషియాలోని తూర్పు జావాలోని మలాంగ్ నగరం, కంజురుహాన్ స్టేడియంలో జరిగిన పుట్ బాల్ మ్యాచ్‌లో ఘోరం జ‌రిగింది. స్టేడియంలో జ‌రిగిన‌ తొక్కిస‌లాట కార‌ణంగా 127 మంది మ‌ర‌ణించారు. మృతులో పోలీసులు కూడా ఉన్న‌ట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.

ఇండోనేషియా ప్రీమియర్ లీగ్ లో అరేమా మలాంగ్‌- పెర్సెబయా సురబయ జ‌ట్ల‌ మ‌ధ్య మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌, ఓడిపోయిన జ‌ట్టు మ‌ద్ద‌తుదారులు ఒక‌సారిగా పిచ్ పైకి చొర‌బడ్డారు. దీంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించ‌డంతో జ‌రిగిన తొక్కిస‌లాట వ‌ల్ల దాదాపు 127 మంది మ‌ర‌ణించ‌డంతో పాటు చాల మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, మృతుల సంఖ్య ఇక పెర‌గ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

కాగా ఈ మ్యాచ్ లో పెర్సెబయా సురబయ జ‌ట్టు అరేమా మలాంగ్‌ జ‌ట్టును 3-2తో ఓడించింది. ఈ ఘ‌ట‌న నేప‌ధ్యంలో జ‌ర‌గ‌బోయో మ్యాచ్‌ల‌ను వారం పాటు సస్పెండ్ చేసింది.