‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సినిమా మసూద.
మళ్ళీ రావా ఒక లవ్-స్టోరీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒక డిటెక్టివ్-థ్రిల్లర్, ఇప్పుడు మేకర్స్ మసూదతో హారర్-డ్రామా జానర్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటంచారు. సినిమాను నవంబర్ 11న విడుదల చేస్తున్నట్లు నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భగా నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ “ప్రేక్షకులు ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో మసూద ఒకటిగా నిలుస్తుందని మా గట్టి నమ్మకం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర వివరాలను తెలియజేస్తాం అన్నారు.