20 ఏళ్ల తర్వాత ..అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. మొదటి నుండి కాంగ్రెస్ చీఫ్ గా అనుకున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పోటీ నుండి తప్పుకున్నారు.. రాజస్ధాన్ లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష రేసు నుండి తప్పుకోవడంతో అధ్యక్ష పోటీకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ మళ్లీ అధ్యక్ష రేసులో మరో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖర్గే అధ్యక్ష రేసులోకి రావడంతో దిగ్విజయ్ నామినేషన్ దాఖలు చేయటంపై అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ఖర్గే కూడా దిగ్విజయ్ లాగా గాంధీ కుటుంబనికి విధేయుడే.
ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశి థరూర్ పోటిలో ఉండగా.. థరూర్ కు పోటీగా ఎవరూ నిలుస్తారనది అసక్తి రేపుతోంది. శశి థరూర్, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలే.
ఖర్గే చివరి నిమిషంలో ఎంట్రీపై శశి థరూర్ స్పందిస్తూ మల్లిఖార్జున్ ఖర్గే చాలా గౌరవనీయమైన సహోద్యోగి అని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఎక్కువ మంది ఉండటం మంచి విషయమన్నారు. ఎంత ఎక్కువ మంది పోటీలో ఉంటే పార్టీకి అంత మంచి జరుగుతుందన్నారు.