బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి మేటర్ ఎప్పటికప్పుడు వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంది. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే గాసిప్స్ నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఏకంగా ఓ సీనియర్ హీరోయిన్ వాళ్ల పెళ్లిపై రియాక్ట్ అయింది. ఈ ఏడాదిలోనే రణబీర్-అలియా పెళ్లి చేసుకుంటారని కూడా చెబుతోంది. ఆ హీరోయిన్ లారా దత్తా.
“నేను పాత తరానికి చెందిన నటిని. ఇప్పటి జనరేషన్ హీరోహీరోయిన్లలో ఎవరు డేటింగ్ లో ఉన్నారో, ఎవరు విడిపోయారో నాకు తెలీదు. రణబీర్, అలియా భట్ గురించి మాత్రం తెలుసు. నాకు తెలిసి వాళ్లు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారు.”
ఇలా రణబీర్-అలియా పెళ్లిపై సూటిగా స్పందించింది లారా దత్తా. తనకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ ఈ ఏడాదిలోనే పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్నారని బయటపెట్టింది. ఈ సందర్భంగా డేటింగ్ పై స్పందిస్తూ.. ఈ కాలం డేటింగులపై స్పందించకుండా మౌనంగా ఉండడమే మంచిదని అభిప్రాయపడింది.
2017 నుంచి రణబీర్, అలియా ప్రేమించుకుంటున్నారు. 2019లో మాత్రం వీళ్ల ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ గా ఇద్దరూ కలిసున్న ఫొటోలు బయటకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తమ రిలేషన్ షిప్ ను దాచిపెట్టే ప్రయత్నం చేయడం లేదు ఈ జంట.
వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇక ఈ ఏడాది అలియా భట్, ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది.