వణుకెందుకు తమ్ముళ్ళూ… ?

ఫైవ్ స్టార్ హొటల్స్ అంటేనే విలాసానికి మారుపేరు. విశాఖలో ఇలాంటి హొటల్స్ అన్నీ ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వాటిని కట్టాలని నిర్ణయించుకుంది. అందుకోసం అందమైన బీచ్ తీరాన్ని ఎంపిక చేసుకుంది.…

ఫైవ్ స్టార్ హొటల్స్ అంటేనే విలాసానికి మారుపేరు. విశాఖలో ఇలాంటి హొటల్స్ అన్నీ ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వాటిని కట్టాలని నిర్ణయించుకుంది. అందుకోసం అందమైన బీచ్ తీరాన్ని ఎంపిక చేసుకుంది.

ప్రస్తుతం ఉన్న హరితా రిసోర్ట్స్ స్థానంలో ఫైవ్ స్టార్ ప్లస్ పేరిట అత్యాధునిక హొటళ్ళను నిర్మిస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారు. విశాఖకు విభజన తరువాత ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని, పెద్ద ఎత్త్తున పర్యాటకులు వస్తున్నారని ఆయన చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వమే ఫైవ్ స్టార్ హొటల్స్ కట్టాలనుకుంటోందని మంత్రి అంటున్నారు. ఇందుకోసం రెండు విడతలుగా ఏకంగా 164 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఫైవ్ స్టార్ ప్లస్ పేరిట సర్కారీ హొటల్స్ ని తాము నిర్మిస్తామంటే తెలుగు తమ్ముళ్ళు వణుకుతున్నారని మంత్రి విమర్శిస్తున్నారు. 

ఈ హొటల్స్ రాకతో టీడీపీ వారికి చెందిన ప్రైవేట్ హొటల్స్ గిరాకీ దారుణంగా తగ్గుతుందన్న భయం వల్లనే వారు యాగీ చేస్తున్నారని ఆయన అంటున్నారు.

మొత్తానికి విశాఖ బీచ్ రోడ్డులో రిసార్ట్స్ ప్లేస్ లో అందమైన హొటల్స్ రావడం అంటే అభివృద్ధిగానే చూడాలని వైసీపీ నేతలు అంటూంటే పాత వాటిని కూలగొట్టడం విద్వంశమే అవుతుంది అని టీడీపీ వారు అంటున్నారు. ఇలా లేటెస్ట్ పరిణామాలతో విశాఖ సాగర తీర ప్రాంతం మరో మారు హీటెక్కుతోంది.