ఎన్టీఆర్ ను ఏడిపించింది ఎవరు?

నడిరోడ్డు మీద…ఎర్రటి ఎండలో…చెమటలు కారుతుంటే, కళ్లంట నీళ్లు పెట్టుకుని, అంత వయసు మీద పడిన పెద్దాయిన ఏడుస్తుంటే జనాలు నివ్వెరపోయి చూసారు. ఆ పెద్దాయిన ఎన్టీఆర్.  Advertisement తను పెట్టుకున్న పార్టీ, తన అధికారం,…

నడిరోడ్డు మీద…ఎర్రటి ఎండలో…చెమటలు కారుతుంటే, కళ్లంట నీళ్లు పెట్టుకుని, అంత వయసు మీద పడిన పెద్దాయిన ఏడుస్తుంటే జనాలు నివ్వెరపోయి చూసారు. ఆ పెద్దాయిన ఎన్టీఆర్. 

తను పెట్టుకున్న పార్టీ, తన అధికారం, తన నుంచి గుంజుకుంటే, కబ్జా చేస్తే, ఎదిరించలేక…వెనుక వత్తాసు పలికే మీడియాలేక, అందరూ కలిసి చేసిన దుర్మార్గాన్ని జనం ముందే ఏకరవు పెట్టి, ఎన్టీఆర్ పబ్లిక్ లో ఏడ్చిన క్షణాలు ఇంకా చాలా మందికి గుర్తున్నాయి. డిజిటల్ మీడియా, యూ ట్యూబ్, వాట్సాప్ లేదు కానీ లేదూ అంటే ముదిమి మీదపడిన వేళ, ఆ వయసులో ఆ మహానుభావుడు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో లు భయంకరంగా వైరల్ అయ్యేవి.

ఇంతకు ఎన్టీఆర్ ఇంతలా ఏడవడానికి కారణం ఎవరు?

పార్టీని గుంజుకుని, కబ్జా చేసింది ఎవరు?

దానికి సహకరించింది ఎవరు?

ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తీసేసారో అంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు కారణం కాదా?

మా నాన్న తెలుగు జాతి వెన్నెముక అంటున్న బాలయ్య కాదా? ఆ వెన్నుముక పక్క వెన్నుపోటు పొడించింది.

ఇప్పుడు గగ్గోలు పెడుతున్న మీడియా కాదా? అప్పుడు మొహం చాటేసి, చంద్రబాబు చంకనెత్తుకున్నది?

చంద్రబాబు ఇప్పుడు ఇంత యాగీ చేస్తున్నారు. అలాంటి చంద్రబాబును బాలయ్య స్వంత సోదరుడు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఏమన్నారు. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ ఏమన్నారు?

జగన్ మహా అయితే పేరు తీసేసాడు తప్పే అనుకుందాం. చంద్రబాబు ఏకంగా చావుకు కారణం అయ్యారు కదా? అల్లుళ్లు, పిల్లలు అంతా కలిసి తనను కుర్చీ నుంచి కిందకు లాగి, తన అధికారం గుంజుకుని, తన పార్టీని కబ్జా చేస్తే కదా, ఆ అవమానంతో, ఆ నయవంచనతో కృంగి కృశించి కదా ఎన్టీఆర్ అచిరకాలంలో మరణించినది.

ఇప్పుడు చెప్పండి బ్రదర్స్..ఎన్టీఆర్ పేరుకు జగన్ చేసిన ద్రోహం ఏ మేరకు.

ఎన్టీఆర్ కు ఆయన స్వంత కుటుంబం చేసిన ద్రోహం ఏమేరకు?