రామ్ చరణ్, శంకర్ మూవీ తొందరగా ఓ షేప్ తీసుకుంటోంది. అసలు వస్తుందా రాదా అనే అనుమానాల నుంచి ఏకంగా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే దశకు చేరుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లీగల్ సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించుకున్న శంకర్.. చరణ్ తో సినిమాను వచ్చే నెల నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 8 నుంచి రామ్ చరణ్, శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మేరకు చరణ్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. సినిమాకు సంబంధించి శంకర్ ఇప్పటికే లొకేషన్లు వెదికే పనిలో పడ్డాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్ని ఆయన సెలక్ట్ చేశాడు.
ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ను ఇండియాలోనే పూర్తిచేయబోతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోనే కంప్లీట్ చేస్తారు. కథకు ఈ ప్రాంతాలకు లింక్ ఉందని చెబుతున్నారు. పక్కా షెడ్యూల్స్ ప్రకారం, 2022 జులై నాటికి షూటింగ్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు. కాకపోతే శంకర్ తో అదంత ఈజీనా అనేది అప్పుడే చెప్పలేం.
ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా కియరా అద్వానీని ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ఆమె కాల్షీట్లు కేటాయించిందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు తమన్ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ ను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇది దిల్ రాజు కలల ప్రాజెక్టు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది.