చిరు కూడా స్పీడ్ పెంచారట.. నమ్మొచ్చా?

చివరికి మహేష్ బాబు కూడా 2 సినిమాలు చేస్తున్నాడంటే నమ్మొచ్చు కానీ, చిరంజీవి స్పీడ్ పెంచారంటే మాత్రం నమ్మడం చాలా కష్టం. కానీ 2 రోజులుగా ఈ తరహా వార్తలు సోషల్ మీడియాలో అక్కడక్కడ…

చివరికి మహేష్ బాబు కూడా 2 సినిమాలు చేస్తున్నాడంటే నమ్మొచ్చు కానీ, చిరంజీవి స్పీడ్ పెంచారంటే మాత్రం నమ్మడం చాలా కష్టం. కానీ 2 రోజులుగా ఈ తరహా వార్తలు సోషల్ మీడియాలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. చిరంజీవి స్పీడ్ పెంచారట. ఈసారి 2 సినిమాల్ని ఏకకాలంలో పూర్తిచేస్తారట. నిజమేనా?

ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఆచార్య. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తయింది. దీని తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొస్తారు. సరిగ్గా ఇక్కడే మరో 2 సినిమాలు తెరపైకొస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ కాకుండా, చిరు చేతిలో బాబి, మెహర్ రమేష్ వేదాళం ప్రాజెక్టులున్నాయి. స్వయంగా చిరంజీవి ఎనౌన్స్ చేసిన సినిమాలివి.

లూసిఫర్ రీమేక్ తో పాటు, వీటిలో ఒక సినిమాను చిరంజీవి సైమల్టేనియస్ గా ప్రారంభిస్తారని కథనాలు వస్తున్నాయి. ఎక్కువ రోజులు దర్శకుల్ని వెయిట్ చేయించడం ఇష్టంలేక చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే.. మధ్యలో ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ తో మరో దర్శకుడు వచ్చి చేరడంతో చిరు ఈ డెసిషన్ తీసుకున్నారని మరికొందరు అంటున్నారు.

ఎవరి లెక్కలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే చిరంజీవి తన వయసురీత్యా, ఇతర కారణాల వల్ల రోజుకు 2 సినిమాలు చేసే పొజిషన్ లో లేరు. ఆయన సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, వ్యక్తిగత జీవితానికి, ఇండస్ట్రీ వ్యవహారాలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఇతర హీరోలతో పోటీపడి ఏడాదికి 2 సినిమాలు రెడీ చేయాలని చిరంజీవి అనుకోవడం లేదు. ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాను నెమ్మదిగా పట్టాలపైకి తీసుకొస్తారు.