‘తమ్ముడు’ కి మళ్లీ సినిమా

చిన్న తెర సెలబ్రిటీ ఓంకార్ సోదరుడు అశ్విన్. గతంలో కొన్ని సినిమాలు చేసిన అశ్విన్ చేస్తున్న లేటెస్ట్ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అనౌన్స్ చేసారు.  Advertisement హిండింబ పేరుతో అశ్విన్…

చిన్న తెర సెలబ్రిటీ ఓంకార్ సోదరుడు అశ్విన్. గతంలో కొన్ని సినిమాలు చేసిన అశ్విన్ చేస్తున్న లేటెస్ట్ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అనౌన్స్ చేసారు. 

హిండింబ పేరుతో అశ్విన్ చేస్తున్న ఈ సినిమాకు దర్శకుడు అనిల్ కృష్ణ కన్నెగంటి. తెరవెనుక ఎన్నో స్క్రిప్ట్ లకు సహాయ సహకారాలు అందించిన అనిల్ హిడింబ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

త‌ల‌పై ర‌క్త‌పు చుక్క‌లు.. చేతిలో ఇనుప చువ్వ‌ను ప‌ట్టుకుని మెలి తిప్పిన మీసాల‌తో యుద్ధానికి సిద్ధం అనేలా యాక్ష‌న్ లుక్ లో అశ్విన్ కనిపించడం విశేషం.

సినిమా ఇప్ప‌టికే యాబై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి  వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు. 

అశ్విన్ తొ పాటు, నందితా శ్వేత‌, శ్రీనివాస రెడ్డి, సాహితి అవంచ‌, సంజ‌య్ స్వ‌రూప్‌, సిజ్జు, విద్యుల్లేఖా రామ‌న్‌, రాజీవ్ క‌న‌కాల‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ప్ర‌మోదిని, ర‌ఘు కుంచె, రాజీవ్ పిళ్లై నటిస్తున్నారు.