పోర్నోగ్రఫీ చిత్రపరిశ్రమలో కొందరికి ఆదాయ వనరుగా మారింది. ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త , ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ ఉచ్చులో ఇరుక్కున్న సంగతిని మరిచిపోకనే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ దఫా ఓ వర్ధమాన నటి పేరు బయటికి రావడంతో పాటు అరెస్ట్‌కు దారి తీయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
పశ్చిమబెంగాల్లో రెండో కంటికి తెలియకుండా అశ్లీల చిత్రాల వ్యాపారం సాగిస్తున్న మోడల్, వర్ధమాన నటి నందితా దత్తా (30) పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం గమనార్హం. నందితాకు సినిమా చాన్స్‌లు దక్కకపోవడంతో పోర్నోగ్రఫీ మార్గం పట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట ఆమె నటిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని తన పరిచయాలతో వర్థమాన మోడల్స్‌కు వెబ్ సిరీస్ అవకాశాలను ఆశపెట్టి చివరికి పోర్నోగ్రఫీ రొంపిలో దింపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు బాధితురాళ్ల ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
నక్‌టాలాలో తన ఇంట్లో ఓ మోడల్ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నందితాను అదుపు లోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో డమ్ డమ్లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్ నేతృత్వంలో పోర్న్ షూటింగ్ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉందనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌కుంద్రాతో వీరికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసేందుకు సిద్ధపడుతున్నారు.