మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. దాని తరువాత లూసిఫర్ రీమేక్ మీదకు వెళ్లారు. ఇప్పటి వరకు వున్న వార్తల ప్రకారం దాని తరువాత మైత్రీ మూవీస్ తో బాబీ డైరక్షన్ లో సినిమా చేయాల్సి వుంది. అయితే లూసిఫర్ కు బాబీ సినిమాకు మధ్య వేరే సినిమా చేసే ఆలోచనలో మెగాస్టార్ వున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై మెగాస్టార్ ఆలోచిస్తున్నారని బోగట్టా. సెప్టెంబర్ నుంచి తన సినిమా షూటింగ్ వుంటుందని బాబీ చెబుతున్నారు కానీ లూసిఫర్ రీమేక్ పూర్తయ్యే వరకు మరో సినిమాను మెగాస్టార్ స్టార్ట్ చేయబోవడం లేదని తెలుస్తోంది. లూసిఫర్ తరువాత కూడా వేదాలం సినిమా ముందుగా టేకప్ చేస్తారు.
అలాగే ఓ ఫ్యామిలీ స్టోరీ చేసే ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ ఫన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు అందించే డైరక్టర్ ఒకరు చెప్పిన లైన్ ను మెగాస్టార్ ఓకె చేసి వుంచారు.
ఆచార్య, లూసిఫర్ రీమేక్, వేదాలం రీమేక్ వంటి సీరియస్ సినిమాల తరువాత మళ్లీ బాబీతో భారీ సినిమా చేయడమా? లేక వెరైటీగా లైటర్ వీన్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ను టేకప్ చేయడమా? అన్నది ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది. అది తేలితే బాబీ సినిమా ఈ ఏడాదిలో మొదలవుతుందో లేదో తెలుస్తుంది.