చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం చేలరేగిన రాజకీయ దూమరం కొనసాగుతోనే ఉంది. ఎవరో చెప్పితేనే కొడాలి నానిని విమర్శిస్తామ్ అన్నట్లు.. కొడాలి అనుచిత వ్యాఖ్యల తరువాత టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు రెచ్చగొట్టితే తప్పా నోరు మెదపని టీడీపీ నేతలు గత రెండు రోజుల నుండి కొడాలి నానికి వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో కేసులు, దర్నాలు చేస్తూ కొడాలి నానిపై చెప్పలేని భాషలో తిడుతూ మాట్లాడుతూన్నారు.
ఇవాళ మాజీ మంత్రి కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కొడాలి నానిపై తొడ కొట్టి ఛాలెంజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలిని ఓడిస్తామంటూ శపధం చేశారు. దేవినేని ఉమాతో పాటు గుడివాడ టీడీపీ ఇన్ చార్జి రావి వెంకటేశ్వరావు కూడా తొడ కొట్టి కొడాలిని ఎట్టి పరిస్ధితిలో ఓడిస్తామన్నారు.
కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అవినాష్ ను తరిమికొడతాం అని, ఈ ముగ్గురికి టీడీపీ అధికారంలోకి రాగానే ఇబ్బందులు తప్పవని దేవినేని ఉమ హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నరని మండిపడ్డారు.
దేవినేని ఉమా తన నియోజవర్గంలోనే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని అలాంటిది గుడివాడ అంటే కొడాలి నాని అడ్డ అనే పేరు ఉన్న దానిని ఎలా ఓడిస్తారో ఉమకే తెలియంటూన్నారు వైసీపీ శ్రేణులు. ఆయినా ఈ మధ్య కాలంలో అడవారి నుండి మొదలు కొని మగవారు వరకు అందరూ టీడీపీ నేతలు తొడలు కొట్టడం అలవాటు అయినట్లు కనపడుతోంది.
చంద్రబాబు చేప్పితే తప్పా ప్రజల్లో వెళ్ళాని నేతలు కూడా ఓడిస్తా అంటూ ప్రగల్బాలు పలకడం కాసింత విడూరంగానే అనిపిస్తోంది.