కొన్ని గాసిప్స్ ఎలా పుడతాయో అస్సలు అర్థంకావు. ఆల్రెడీ దీపిక పదుకోన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అలాంటి ప్రాజెక్టులోకి సమంతను సెకెండ్ హీరోయిన్ గా తీసుకుంటారా? ప్రాజెక్ట్-K సినిమాకు సంబంధించి వినిపిస్తున్న పుకారు ఇది. ఈ ప్రాజెక్టులోకి తాజాగా సమంతను కూడా తీసుకున్నారనేది ఆ పుకారు సారాంశం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోంది ప్రాజెక్ట్-K. గతంలో ఈ దర్శకుడు మహానటి సినిమా తీశాడు. అందులో మెయిన్ లీడ్ గా కీర్తిసురేష్ నటించగా.. మరో ముఖ్యపాత్రలో సమంత నటించింది. సో.. ఇప్పుడు నాగ్ అశ్విన్ తీస్తున్న ప్రాజెక్ట్-Kలో కూడా ఇలానే సమంతను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నాడంటూ ఓ సెక్షన్ మీడియా రాసుకొచ్చింది.
నిజానికి ప్రభాస్ ప్రాజెక్ట్-K సినిమాకు సమంతకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాకు సంబంధించి సమంతను ఎవ్వరూ సంప్రదించలేదు కూడా. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా శాకుంతలం.
ఇక ప్రాజెక్ట్-కె.. షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో తొలి షెడ్యూల్ మొదలుపెట్టారు. ఇప్పుడా షెడ్యూల్ ను ముగించారు.
తన పోర్షన్ కు సంబంధించి కొన్ని సీన్స్ కంప్లీట్ చేసిన అమితాబ్, తిరిగి ముంబయి వెళ్లిపోయారు. మూవీ నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. ప్రభాస్, దీపిక ఈ మూవీ సెట్స్ పైకి ఇంకా రాలేదు.