హీరో విశాల్ సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్ లు మామూలుగా వుండవు. అసలు విశాల్ కు పేరు తీసుకువచ్చినవే యాక్షన్ సీన్లు.
అందుకే ఆ సీన్లు చేయడానికి కాస్త రిస్క్ తీసుకుంటూ వుంటాడు. డూప్ ల జోలికి వెళ్లడు. పలితంగా అప్పుడప్పుడు గాయలపాలు అవుతుంటాడు. ప్రస్తుతం విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. శరవణన్ దర్శకుడు.
ఈ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తుండగా విశాల్ రెండు సార్లు బలంగా గోడను ఢీకొన్నాడు. దాంతో వీపు వైపు గట్టిగా దెబతిన్నాడు. సినిమాలో క్లయిమాక్స్ భాగంగా వచ్చే యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది.
యాక్షన్ సీన్ లో భాగంగా కట్టిన రోప్స్ ను లాగాల్సిన దానికన్నా బలంగా లాగడం వల్లనో, మిస్ కమ్యూనికేషన్ వల్లనో గోడకు విశాల్ రెండు సార్లు బలంగా డీకొన్నాడు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నాడు విశాల్.