సౌత్ లో బ్లాక్ బస్టర్ హీరోయిన్ నయనతార. అత్యథిక రెమ్యూరనేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఆమెనే. అయితే ఇంత స్టార్ డమ్ తెచ్చుకున్న నయనతార బాలీవుడ్ లో ఎప్పుడూ ట్రై చేయలేదు. 2-3 సినిమాలు చేసిన హీరోయిన్లే బాలీవుడ్ లో అడుగుపెడుతున్న ఈ రోజుల్లో నయనతార మాత్రం అటు వైపు చూడలేదు.
ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చిందంటోంది కోలీవుడ్ మీడియా. అన్నీ అనుకున్నట్టు జరిగితే షారూక్ సరసన నయన్ నటించే ఛాన్స్ ఉందంట.
త్వరలోనే షారూక్ తో ఓ సినిమా చేయబోతున్నాడు దర్శకుడు అట్లీ. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలోనే షారూక్ సరసన నయనతార హీరోయిన్ గా నటించబోతోందట. నిజానికి ఈ పుకార్లు చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి, కాకపోతే ఈసారి నయనతార బాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తయిందంటోంది కోలీవుడ్ మీడియా.
అట్లీ సినిమాలో షారూక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. పక్కా సౌత్ మసాలా సినిమాల టైపులోనే షారూక్ సినిమా కూడా ఉండబోతోంది. షారూక్ ఇలాంటి మసాలా సినిమా చేసి చాన్నాళ్లయింది. అందుకే అట్లీ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా వెయిట్ ఉంటుందట. అందుకే నయనతారను తీసుకున్నారని చెబుతున్నారు.
సినిమా ఎనౌన్స్ మెంట్ ఇంకా అధికారికంగా జరగలేదు. అందుకే నయనతార ఎంట్రీని కూడా ఇంకా అఫీషియల్ గా బయటపెట్టలేదంటున్నారు. త్వరలోనే నయన్ బాలీవుడ్ ఎంట్రీపై ఓ స్పష్టత రానుంది.