మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కండలవీరుడు ఎవర్ని పెళ్లి చేసుకుంటాడా అనే చర్చ ఏళ్ల తరబడి సాగింది. ఈ రెండు దశాబ్దాల్లో దాదాపు 10 మందితో సల్మాన్ డేటింగ్ చేశాడంటూ లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడీ చర్చ అనవసరం. 55 ఏళ్ల సల్మాన్ పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడితే అది కామెడీనే అవుతుంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా ఓ అంశం తెరపైకొచ్చింది.
సల్మాన్ ఖాన్ కు ఇదివరకే పెళ్లి అయిందట. అతడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారట. వాళ్లు దుబాయ్ లో ఉంటున్నారట. అంతేకాదు, సల్మాన్ ఖాన్ దుబాయ్ లో దాక్కుంటున్నాడట. ఇదీ ఓ సోషల్ మీడియా పోస్ట్ సారాంశం. ఇది నేరుగా సల్మాన్ ఖాన్ వరకు వచ్చింది.
“ఈ ఆరోపణ చేస్తున్న జనాల దగ్గర సరైన సమాచారం లేదు. ఇదొక పనికిమాలిన చర్చ. ఇది ఎవరి గురించి రాశారో, ఎందుకు పోస్ట్ చేశారో అర్థం కావడం లేదు. అసలు ఈ పోస్ట్ తో వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు.”
ఇలా తనపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టాడు సల్మాన్ ఖాన్. కేవలం పోస్ట్ పెట్టిన వ్యక్తుల పేర్లు తన నోటి ద్వారా చెప్పించాలని, వాళ్ల ప్రచారం కోసం ఇలాంటి రాతలు రాస్తున్నారని సల్మాన్ అన్నాడు. 9 ఏళ్ల వయసు నుంచి తను ముంబయిలోనే ఉంటున్నానని స్పష్టంచేశాడు.
ఇలాంటి తప్పుడు రాతలకు తను స్పందించనని, తను ఎక్కడ నివశిస్తున్నానో, ఎప్పట్నుంచి నివశిస్తున్నానో దేశం మొత్తానికి తెలుసన్నాడు సల్మాన్. సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్వహించిన ఓ టాక్ షోలో ఈ కామెంట్స్ చేశాడు సల్మాన్.
రీసెంట్ గా రాధే సినిమాతో ఒకేసారి థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చాడు సల్మాన్ ఖాన్. త్వరలోనే కత్రినా కైఫ్ తో కలిసి టైగర్-3 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.