లూసిఫర్ లో సముద్రఖని

దర్శకుడు సముద్రఖని నటుడిగా మారి ఫుల్ బిజీ అయిపోయారు. అలవైకుంఠపురములో సినిమాతో తెలుగులో పాత్రలు వెదుక్కుంటూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ రీమేక్ లో కీలకపాత్ర చేస్తున్నారు.  Advertisement మహేష్ బాబు సర్కారు వారి…

దర్శకుడు సముద్రఖని నటుడిగా మారి ఫుల్ బిజీ అయిపోయారు. అలవైకుంఠపురములో సినిమాతో తెలుగులో పాత్రలు వెదుక్కుంటూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ రీమేక్ లో కీలకపాత్ర చేస్తున్నారు. 

మహేష్ బాబు సర్కారు వారి పాట విలన్ ఆయనే. ఇలా చాలా అంటే చాలా సినిమాలు కిట్టీలో పడుతున్నాయి. లేటెస్ట్ గా మరో మంచి అవకాశం వచ్చిందని తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి చేయబోయే లూసిఫర్ లో మంచి పాత్రను సముద్రఖని కి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. లూసిఫర్ కు అనేక మార్పులు చేర్పులు చేసి తెలుగులో చేస్తున్నారు. మరి అందువల్ల సముద్రఖనికి ఆఫర్ చేస్తున్న పాత్ర ఏమిటో తెలియాల్సి వుంది. 

ప్రస్తుతం ఆచార్య ఫినిష్ చేసే పనిలో వున్న మెగాస్టార్ త్వరలో లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించే ఈ సినిమాకు ఎన్వీప్రసాద్ నిర్మాత.