బింబిసార 2 .. ఇంకా చాలా దూరం

బింబిసార సినిమా మంచి హిట్. దాని వెంటనే సీతారామం..కార్తికేయ2 సినిమా వచ్చి పడ్డాయి. దాంతో ఓ రేంజ్ వరకు వెళ్లి ఆగిపోయింది.  Advertisement ఇలా వుంటే బింబిసార 2 సినిమా వుంటుదని ముందే చెప్పారు.…

బింబిసార సినిమా మంచి హిట్. దాని వెంటనే సీతారామం..కార్తికేయ2 సినిమా వచ్చి పడ్డాయి. దాంతో ఓ రేంజ్ వరకు వెళ్లి ఆగిపోయింది. 

ఇలా వుంటే బింబిసార 2 సినిమా వుంటుదని ముందే చెప్పారు. దాంతో దాని కథేంటీ..ఎలా వుంటుందీ అన్న దాని మీద గ్యాసిప్ లు వండడం మొదలైంది. కానీ అసలు విషయం ఏమిటంటే బింబిసార 2 సినిమా చాలా అంటే ఇంకా చాలా దూరం వుందట.

ప్రస్తుతానికి దర్శకుడు వశిష్ఠ గుళ్లు, గోపురాలు తిరిగే ప్రోగ్రామ్ లో వున్నారు. మరో నెల ఇలాగే గడిపిన తరువాత రెండో భాగం కథ ఏం అల్లాలన్నది మొదలుపెడతారట. 

కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. మైత్రీ మూవీస్, అభిషేక్ నామా, దిల్ రాజు ఇలా మూడు సినిమాలు ఫినిష్ చేసి, విడుదల చేయాల్సి వుంది. పైగా ఎన్టీఆర్-కొరటాల సినిమా నిర్మాణంలో భాగస్వామి కూడా. అందుకే ఇప్పట్లో బింబిసార 2 మీదకు రారు.

అప్పటి వరకు కథను తయారు చేసుకుంటూ వుండడమే. ఈ పని దసరా నుంచి మొదలుపెడతారట. అప్పటి వరకు ఈ కథ గురించి ఊహాగానాలే తప్ప మరేమీ పక్కా అప్ డేట్ లు వుండవు.