శివకార్తికేయన్ @ 20 కోట్లు

ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించే విషయమే. మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని తమిళ హీరో.  Advertisement రజనీ, సూర్య, కార్తీ, ధనుష్, ఆర్య ఇలా తెలుగు ప్రేక్షకులకు చాలా మంది తమిళ…

ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించే విషయమే. మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని తమిళ హీరో. 

రజనీ, సూర్య, కార్తీ, ధనుష్, ఆర్య ఇలా తెలుగు ప్రేక్షకులకు చాలా మంది తమిళ హీరోలు పరిచయమే. కానీ వాళ్లతో పోల్చుకుంటే శివ కార్తికేయన్ చాలా తక్కువ పరిచయం. అయితే అతగాడితో తెలుగు నిర్మాతలు సినిమా తీయడానికి రెడీ అయ్యారు.

తెలుగు నిర్మాతలు తీసే తమిళ సినిమా అనుకోవాలేమో? మరి అలా తీయడానికి శివ కార్తికేయన్ తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ 20 కోట్లు. మన దగ్గర టాప్ నలుగైరు అయిదుగురు హీరోలు మినహా మరెవరి రెమ్యూనిరేషన్ 12 కోట్లు దాటలేదు. మన హీరోలతో తీస్తే ఇక్కడ కచ్చితంగా నలభై కోట్ల మార్కెట్ వుంది. 

అలాంటిది శివకార్తికేయన్ కు 20 కోట్ల రెమ్యూనిరేషన్ అంటే ఆశ్చర్యం కాదా? అయితే అతగాడికి అక్కడ నలభై కోట్ల మార్కెట్ వుందట అందుకే ఆ రెమ్యూనిరేషన్ అంట. ఇరవై కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చి, ఇరవై కోట్లతో సినిమా తీస్తే నిర్మాతకు మిగిలేది ఏమిటో?