కేంద్ర మంత్రి, భాజపా నేత అమిత్ షా హైదరాబాద్ రాకకు ఓ రోజు ముందు గొప్ప వార్త ఒకటి గుప్పు మంది. భాజపా-తెలుగుదేశం మధ్య మళ్లీ పొత్తు చిగురించబోతోందన్న ఆశలు కల్పించేంత గొప్ప వార్త అది.
ఈనాడు రామోజీ రావు సమక్షంలో అమిత్ షా-చంద్రబాబుల సమావేశం జరగబోతోందని లేదా ఆర్ ఎఫ్ సి లో ఈ సమావేశం జరగబోతోందని. దీంతో ఇక మామూలు హడావుడి కాదు. ముఖ్యంగా ప్రో టీడీపీ డిజిటల్ మీడియా అయితే మరీనూ. కానీ గమ్మత్తుగా ఈ సమావేశం జరిగిందా? లేదా? జరగకపోతే ఎందుకు జరగలేదు? అన్న వార్తలు బయటకు రాలేదు.
జరగలేదు అన్న సంగతి ఒక పక్క క్లారిటీగా వినిపిస్తోంది. మరో పక్క రాజకీయ ఊహాగానాలు చేసే జనాల్లో వేరుగా వినిపిస్తోంది. అమిత్ షా-చంద్రబాబుల సమావేశాన్ని రహస్యంగా వుంచారన్నది ఆ ఊహాగానం. అమిత్ షా రావడానికి చాలా సమయం ముందే చంద్రబాబు ఫిల్మ్ సిటీకి చేరుకున్నారని, ఈ పర్యటనను అత్యంత గోప్యంగా వుంచారని గ్యాసిప్ వినిపిస్తోంది. ఫిల్మ్ సిటీలోని అత్యంత కీలక ప్రదేశంలో ఈ సమావేశం జరగింది అన్నది ఆ గ్యాసిప్ ఎక్స్ టెన్షన్.
నిజంగా సమావేశం జరిగితే రహస్యంగా ఎందుకు ఉంచుతారన్నది ఓ క్వశ్చను. సమావేశం వుందని ముందు రోజు అంత హడావుడి చేసిన తరవాత మర్నాడు ఎందుకు జరగలేదో చెప్పలేదు కదా, అంటే జరిగే వుంటుంది అన్నది ఓ లాజిక్. మరి జరిగే వుంటే బయటకు రాలేదు కదా…అంటే రహస్యంగా వుంచి వుంటారు అని మరో ముక్తాయింపు.
జరగలేదు అని చెబితే బాబోరికి అవమానం కదా, పైగా ఎందుకు జరగలేదు..ఇది బాబుగారికి అవమానం కదా ఇలాంటి చేదు ఊహాగానాలు అన్నీ కొత్తగా కథనాలుగా మారుతాయి. అందువల్ల తేలు కుట్టిన బాపతులాగా సైలంట్ గా వుండడమే బెటరని వుండిపోయారో లేక అలా వున్నా కూడా అనుమానం వస్తుందని, రహస్యంగా జరిగిపోయిందనే గ్యాసిప్ లు వండుతున్నారో? మొత్తానికి చంద్రబాబు-అమిత్ షాల సమావేశం అనే ఎపిసోడ్ సుఖాంతమా? విషాదాంతమా? ఏమో?