ఇంద్రగంటితో నాకు అఫైర్.…సుధీర్ బాబు

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టిల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కొత్త నిర్మాతలు మహేంద్ర, కిరణ్, సుధీర్ ఈ సినిమాను…

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టిల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కొత్త నిర్మాతలు మహేంద్ర, కిరణ్, సుధీర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిత్రీకరించిన ఓ వెరైటీ పాటను ఈ రోజు ఎ ఎబ్ బి థియేటర్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, ఒకే దర్శకుడితో మూడు సినిమాలు చేసానని, అందువల్ల ఇంద్రగంటికి తనకు అఫైర్ వుందని రాసేసుకోవచ్చు అని చమత్కరించారు. 

ఇంద్రగంటి  కథకు న్యాయం చేసే దర్శకుడు . ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ  ఆనందంగా ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ఉప్పెన వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంది అన్నారు.

ఎలాంటి పాత్ర అయినా చేయగలననే నమ్మకం ఈ సిినిమాతో ఆమెకు వస్తుందని భావిస్తున్నా అన్నారు. మహేష్ బాబు సినిమా ఎంత రిచ్ గా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే రిచ్ నెస్ వుంటుంది. నాకు సిరివెన్నెల గారి పాటలు అంటే ఇష్టం. ఆయన్ని మనం మిస్ కాకూడదు. అలా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్య శాస్త్రి పై వుంది. ఈ పాటను జర్నలిస్ట్ బిఎ రాజుకు, జర్నలిస్ట్ లకు డెడికేట్ చేస్తున్నానని అన్నారు.

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. నేను కూడా జర్నలిస్ట్ గా పని చేశాను. చాలా ఇంటర్వ్యూ లు చేశాను. ఒక ప్రెస్ మీట్ తరహాలో హీరో ఇంట్రో  సాంగ్  వుంటే  ఎలా  వుంటుందనే ఆలోచనని రామజోగయ్య శాస్త్రికి చెప్పాను. ఆయన వెంటనే నన్ను పాతిక ప్రశ్నలు అడిగారు. చిన్న ఎత్తిపొడుపు, చమత్కారం, చిన్న సంఘర్షణ .. ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చారు. వివేక్ వండర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. దినేష్ దీనికి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు.  

సుధీర్ నా ఫేవరేట్ నటుడు. ఇందులో కూడా అద్భుతమైన ఫెర్ఫార్ మెన్స్ వుంటుంది. కృతిని ఉప్పెన కంటే ముందే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా కొత్త కృతి కనిపిస్తుంది. ఈ పాట నా ప్రెస్, మీడియా ఫ్రెండ్స్ కి అంకితం చేస్తున్నా. మీ సమక్షంలో పాటని విడుదల చేయడం ఆనందంగా వుంది. మంచి సినిమాలు తీసే నిర్మాతలని ప్రొత్సహిస్తారని కోరుతున్నా'' అన్నారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఇంద్రగంటి మోహన కృష్ణ కి నేను పెద్ద  ఫ్యాన్ ని. ఆయన తీసిన గ్రహణం నాకు చాలా ఇష్టం. నాపై చాలా ప్రభావాన్ని చూపిన సినిమా అది. ఆయన సినిమాలన్నీ సహజంగా వుంటాయి. సమ్మోహనం నాకు చాలా ఇష్టం. సుధీర్ బాబు ప్రతి సారి కొత్తగా కనిపిస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.

కృతి శెట్టి మాట్లాడుతూ..  ఒక మంచి సినిమా ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ కావాలంటే మీడియా, పీఆర్వో ల పాత్ర కీలకం. మీడియాకి థాంక్స్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. సుధీర్ బాబు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సుధీర్ తో నటించడం ఆనందంగా వుందన్నారు.

సమర్పకులు గాజులపల్లె సుధీర్ బాబు మాట్లాడుతూ.. రామజోగయ్య శాస్త్రి సంగీత దర్శకుడు వివేక్ సాగర్ డివోపీ పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ నిర్మాతలు బి మహేంద్ర బాబు, కిరణ్ తదితరులు ప్రసంగించారు.