అల్లూరి తిరుగుబాటుకు వందేళ్ళు

ఆయన విప్లవ వీరుడు. గిరిజనులతో కలసి తెల్ల దొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. అల్లూరి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలోనే మూడేళ్ళ పాటు బ్రిటిష్ పాలకుల మీద…

ఆయన విప్లవ వీరుడు. గిరిజనులతో కలసి తెల్ల దొరల మీద అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. అల్లూరి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలోనే మూడేళ్ళ పాటు బ్రిటిష్ పాలకుల మీద అలుపెరగని పోరాటం చేసి తన సత్తా ఏంటో చాటాడు.

అల్లూరి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయాడు. ఆయన పేరు చెబితే బ్రిటిష్ అధికారులు వణికిపోయే పరిస్థితి ఉండేది. అలాంటి అల్లూరి తొలిసారి తెల్లదొరల మీద పోరాటం మొదలెట్టిన రోజు ఒకటి ఉంది. అదే 1922 ఆగస్ట్ 22న ఆయన మొదటిసారి అమ్ములు సంధించి తెల్లవారి మీద నిప్పులే కురిపించాడు. చింతపల్లి పోలీస్ స్టేషన్ ని ఆయన తగులబెట్టారు. అలా చరిత్రలో నిలిచిన ఆ తొలి పోరుకు మన్నెం పోరాటం అని పేరు.

చింతపల్లి నుంచే అలా అల్లూరి పోరాటం అలా మొదలైంది. అల్లూరి తొలి పోరాటం చేసి వందేళ్ళు ఈ నెల 22కు పూర్తి అవుతాయి. దాంతో చింతపల్లి ఇపుడు అద్భుతమైన సమర క్షేత్రం అయింది. ఆ రోజున అక్కడ అనేక కార్యక్రామాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.

అదే రోజున కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. అల్లూరి నడయాడిన ప్రాంతంలో కేంద్ర మంత్రి పర్యటించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. చింతపల్లిలో అల్లూరి జ్ఞాపకాలను చిరస్థాయిలో నిలిపేలా యాభై కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం ని కూడా కేంద్రం ఏర్పాటు చేయనుంది. దానికి కిషన్ రెడ్డి ఆ రోజున శ్రీకారం చుడతారు.