'బాహుబలి'తో ప్రభాస్ రేంజ్ ఖచ్చితంగా పెరిగింది. అయితే ఎంత పెరిగింది, అతనిప్పుడు ఎంత పెద్ద స్టార్ అనే దానిపై ఎవరికీ ఖచ్చితమైన అంచనాలు లేవు. రాజమౌళిని మినహాయిస్తే… మిగతా టాప్ హీరోల మార్కెట్ వంద కోట్ల వద్ద తచ్చాడుతోంది. ఇంతవరకు బాహుబలి కాకుండా జెన్యూన్‌గా వంద కోట్ల షేర్ దాటిన చిత్రాలు రంగస్థలం, ఖైదీ నంబర్ 150 మాత్రమే. మిగతా సినిమాలకి నిర్మాతలే భారీ వసూళ్లు వేసుకుంటే తప్ప వంద దాటడం సాధ్యపడడం లేదు.
మరి తెలుగు సినిమా మార్కెట్ వంద కోట్లు టచ్ చేయడానికి టికెట్ రేట్లు పెంచడం వగైరా లాంటి ఎన్ని జిత్తులు వేసినా నానా పాట్లు పడుతోంటే సాహో చిత్రాన్ని 'బాహుబలి'తో సమానంగా ఎలా కొనేస్తారు? సీడెడ్‌లో 'సాహో' చిత్రానికి పాతిక కోట్లు పెట్టారంటే ప్రభాస్ అభిమానులకే గుబులు పట్టుకుంది. బాహుబలిని పక్కన పెడితే సీడెడ్ మార్కెట్ పదిహేను కోట్ల వద్ద తచ్చాడుతుంటుంది.
అలాంటి చోట ప్రభాస్ ఒక్కడే పాతిక కోట్లు రాబట్టగలడా? అలాగే కర్నాటకలో ఇరవై ఏడు కోట్లకి అమ్మారంటే… రిటర్న్ ఎంత వుంటుంది? ఎప్పటికి వస్తుంది? బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోను పెరిగింది.
కానీ దానికి ఖచ్చితమైన కొలమానం లేకుండా ఇప్పుడు గట్ ఫీలింగ్‌తో బయ్యర్లు బెట్ కడుతున్నారు. ఇది వర్కవుట్ అయితే ఓకే కానీ లేదంటే రంగస్థలం వసూళ్లని దాటినా కానీ సాహో సక్సెస్ అనిపించుకోలేదు!