అది జిబ్రాన్ మ్యూజిక్ కాదా?

సాహో టీజర్ చూసిన వారిని అందరినీ ఆకట్టుకున్నది దాంట్లోని భారీ తనమేకాదు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా. అయితే ఇది మ్యూజిక్ డైరక్టర్ గిబ్రాన్ అని చాలామంది అనుకున్నారు. కానీ అది గిబ్రాన్ మ్యూజిక్…

సాహో టీజర్ చూసిన వారిని అందరినీ ఆకట్టుకున్నది దాంట్లోని భారీ తనమేకాదు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా. అయితే ఇది మ్యూజిక్ డైరక్టర్ గిబ్రాన్ అని చాలామంది అనుకున్నారు. కానీ అది గిబ్రాన్ మ్యూజిక్ కాదని తెలుస్తోంది. కేవలం ఈ టీజర్ కోసం ఓ హాలీవుడ్ ప్రీరికార్డెడ్ ఆర్ ఆర్ బిట్ ను యువి క్రియేషన్స్ భారీ మొత్తం రాయల్టీ చెల్లించి, తెచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆ మ్యూజిక్ బిట్ ను గిబ్రాన్ మరికాస్త ఎక్స్ టెండ్ చేసినట్లు తెలుస్తోంది.

రాయల్టీగా పది నుంచి పదిహేను లక్షల భారీ మొత్తం చెల్లించి, ఆర్ ఆర్ బిట్ ను తెచ్చారని, దానిని ఇప్పుడు టీజర్ కు వాడారని తెలుస్తోంది. సినిమాకు ముందుగా అనుకున్న శంకర్ – ఎహసాన్ – లాయ్ ల ట్యూన్లు అంతగా నప్పకపోవడంతో, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరక్టర్ల చేత ఒక్కోపాట చేయించాలని సాహో మేకర్లు నిర్ణయించారు.

నేపథ్య సంగీతం మాత్రం గిబ్రాన్ చేస్తాడు. అయితే అక్కడక్కడ వాడే సిగ్నేచర్ ట్యూన్ గా మాత్రం టీజర్ లో వినిపించే మ్యూజిక్ బిట్ వుంటుందని తెలుస్తోంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం