మణిశర్మ మాత్రమే గుర్తొచ్చాడు.. రామ్ కామెడీ

ఓ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ను ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం రైజింగ్ లో ఉన్న సంగీత దర్శకులు రేసులో నిలుస్తారు. కాస్త కొత్తదనం కావాలనుకుంటే పక్క పరిశ్రమల నుంచి కూడా తెచ్చుకుంటారు. కానీ ఫేడవుట్…

ఓ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ను ఫిక్స్ చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం రైజింగ్ లో ఉన్న సంగీత దర్శకులు రేసులో నిలుస్తారు. కాస్త కొత్తదనం కావాలనుకుంటే పక్క పరిశ్రమల నుంచి కూడా తెచ్చుకుంటారు. కానీ ఫేడవుట్ అయిన సంగీత దర్శకుడు ఎందుకు గుర్తొస్తాడు? రామ్ కు మాత్రం మణిశర్మ గుర్తుకొచ్చాడట. అందుకే అతడ్ని పెట్టుకున్నాడట.

“ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీ మొత్తం విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇక సంగీత దర్శకుడిగా ఎవర్ని పెట్టుకుందామనే టాపిక్ వచ్చినప్పుడు నాకు వెంటనే మనసులో మణిశర్మ పేరు తట్టింది. ఆశ్చర్యంగా పూరి జగన్నాధ్ కు కూడా అదే పేరు గుర్తొచ్చింది. వెంటనే అతడ్ని ఫిక్స్ చేశాం.”

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మను ఎందుకు తీసుకున్నామో ఇలా కామెడీగా వివరించాడు రామ్. నిజానికి మణిశర్మ పూర్తిగా ఫేడవుట్ అయిన మ్యూజిక్ డైరక్టర్. ఒకప్పుడు మంచి హిట్స్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఎవరూ అతడ్ని సంగీత దర్శకుడిగా చూడడంలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే మణిశర్మను సంప్రదిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ యూనిట్ కూడా మణిశర్మను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కే పరిమితం చేస్తే బాగుండేది. ఆ ప్రభావం తొలి సింగిల్ పై స్పష్టంగా కనిపించింది. దిమాక్ ఖరాబ్ అంటూ విడుదలైన ఈ సాంగ్, గతంలో హిట్ అయిన 2-3 ఐటెంసాంగ్స్ తో పాటు డీజే మిక్స్ లు కలిపి కొట్టినట్టు అనిపించింది. ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ పాట ప్రమోషన్ లో భాగంగానే రామ్ ఇలా మణిశర్మపై రియాక్ట్ అయ్యాడు.

అతడే తోపు అన్నట్టు మాట్లాడాడు. కేవలం బడ్జెట్ తగ్గించుకోవడం కోసమే మణిశర్మను తీసుకున్నారనే విషయం తెలిసిందే.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?