ఆమెకు నగ్నంగా కనిపించడం కొత్తకాదు. గతంలో డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. కేవలం ఓ ఆకును అడ్డంగా పెట్టుకొని, కియరా అప్పట్లో ఇచ్చిన పోజులు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి నగ్నంగా తయారైంది కియరా. ఈసారి కూడా డబూ ఫొటోగ్రఫీ కోసమే.
సముద్రం ఒడ్డున కియరా నగ్నంగా పడుకున్న ఫొటోను తన కెమెరాలో బంధించాడు డబూ. ఈ ఫొటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసిన కియరా.. ఇదే తన ఆల్ టైమ్ ఫేవరెట్ అంటూ స్పందించింది.
అయితే గతేడాది కియరాపై డబూ చేసిన ఫొటో షూట్ తో పోలిస్తే ఇదేమంత పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించదు. కేవలం ఓ ఆకును ఆచ్ఛాదనగా పెట్టుకొని తన ఫొటోలతో గతేడాది కియరా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈసారి కూడా ఆమె నగ్నంగానే బీచ్ లో కనిపించినప్పటికీ, బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ఫొటో అంతగా మెప్పించదు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటు తెలుగులో కూడా భరత్ అనే నేను సినిమాతో ఆమె క్రేజ్ తెచ్చుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ సరసన ఆమె నటించే అవకాశం ఉంది.