ఎవరో ఒకరు కొత్తగా ఆలోచించి, అవకాశం ఇవ్వకపోతే యాక్టర్ల కెరీర్ లు టర్నింగ్ ఇచ్చుకోవు. బోయపాటి జగపతిబాబుకు ఇచ్చినట్లు కొత్తగా ట్రయ్ చేయాల్సిందే దర్శకులు.
మురళీ శర్మ, రావు రమేష్, సత్యరాజ్ ఇలా చాలా మందిని తన సినిమాల్లో కొత్త పాత్రలకు తీసుకున్న దర్శకుడు మారుతి ఈసారి నటుడు అజయ్ ఘోష్ కు భలే చాన్స్ ఇచ్చారు.
హీరోతో సమానమైన మామగారి పాత్రను అజయ్ ఘోష్ కు ఇచ్చారు. మామూలుగా అయితే నరేష్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ ఇలా వుంటుంది ఆలోచన. కానీ పాత్రలో నటుడు కనిపించకూడదు, కొత్తగా వుండాలని అజయ్ ఘోష్ ను తీసుకున్నారట.
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిన్న సినిమాకు మారుతి దర్శకత్వ పర్యవేక్షణ, ఆయన టీమ్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు, బాబు బంగారం ల మాదిరిగా ఓ కాన్సెప్ట్ తో ఈ సినిమా తయారలవుతోంది.