మీడియా సంఘానికి చెల్లని చెక్కు?

టాలీవుడ్ మీడియా సంఘాలకు సినిమా నిర్మాతలు, సెలబ్రిటీలు సహాయం అందివ్వడం కామన్. సభ్యుల భీమా, ఇతరత్రా సహాయ కార్యక్రమాలకు సినిమాల విడుదలల ముందు సెలబ్రిటీల సాయం అందిస్తుంటారు. లేదా వారి వారి బర్త్ డే…

టాలీవుడ్ మీడియా సంఘాలకు సినిమా నిర్మాతలు, సెలబ్రిటీలు సహాయం అందివ్వడం కామన్. సభ్యుల భీమా, ఇతరత్రా సహాయ కార్యక్రమాలకు సినిమాల విడుదలల ముందు సెలబ్రిటీల సాయం అందిస్తుంటారు. లేదా వారి వారి బర్త్ డే ల సందర్భంగా కూడా సహాయాలు ప్రకటిస్తుంటారు. 

అయితే ఇవన్నీ ఇరువైపులా చర్చల దరిమిలా జరుగుతుంటాయి. అయితే ఆ మధ్య నిర్మాత పిలవని పేరంటం మాదిరిగా రెండు లక్షల సహాయం అందించడానికి ముందుకు వచ్చారట. తన బర్త్ డే సందర్భంగా ఆయన ఈ సహాయం ప్రకటిస్తానన్నారట.

దానికే మీడియా జనాలు కాస్త ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆ నిర్మాత నుంచి అలాంటి వ్యవహారం ఊహించలేదు కనుక. సరే, వచ్చారు. రెండు లక్షల చెక్ ఇచ్చారు. వెళ్లారు. కానీ కట్ చేస్తే ఆ చెక్ బౌన్స్ అయిందని బోగట్టా. బ్యాంకులో సరిపడా డబ్బులు లేక చెక్ బౌన్స్ అయినట్లు తెలుస్తోంది.

దాంతో ఈ విషయం ఆయనకు తెలియచేసి, సైలంట్ అయ్యారట మీడియా సంఘ సభ్యులు. ఇది ఆ నోటా ఈ నోటా పడి, మీడియా సభ్యులను దాటి ఇండస్ట్రీలో వినిపించడం ప్రారంభించింది.