మహేష్ రెమ్యూనిరేషన్ ఎంత? అంతనా?

కొద్ది రోజుల క్రితం వరకు మహేష్-త్రివిక్రమ్ సినిమా అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈ ప్రాజెక్టు మీద చాలా గ్యాసిప్ లు పుట్టాయి. కానీ వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ అనౌన్స్ మెంట్…

కొద్ది రోజుల క్రితం వరకు మహేష్-త్రివిక్రమ్ సినిమా అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈ ప్రాజెక్టు మీద చాలా గ్యాసిప్ లు పుట్టాయి. కానీ వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అక్కడితో ఆ అంకం ముగిసింది. 

ఇప్పుడు ఇండస్ట్రీ లో కొత్త డిస్కషన్ పాయింట్, సరికొత్త గ్యాసిప్ ఏమిటంటే మహేష్ రెమ్యూనిరేషన్ ఎంత? అన్నది. మహేష్ రెమ్యూనిరేషన్ ఇంత..అంత అంటూ రకరకాల ఫిగర్లు వినిపిస్తున్నాయి.

మహేష్ రెమ్యూనిరేషన్ 60 కోట్లు అని పక్కాగా వినిపిస్తోంది. కాదు 70 కోట్లు పైగానే అని కూడా వినిపిస్తోంది. అసలు ఇప్పటి వరకు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి రెమ్యూనిరేషన్ డిస్కషన్ నే జరగలేదనీ అంటున్నారు. 

గతంలో మహేష్ రెమ్యూనిరేషన్ 40…45…50 ఇలా వుంటూ వచ్చింది. ఈ సారి 60 కి కాస్త ఇటు అటుగా వుంటుందని అంటున్నారు. కానీ ఇప్పుడు రెమ్యూనిరేషన్లు బాగా పెరిగాయని అందువల్ల 70 కోట్ల పైమాటే తప్ప లోపు కాదని గట్టిగా చెబుతున్నవారూ వున్నవారూ వున్నారు. 

మహేష్ కే 70 కోట్లు ఇస్తే, త్రివిక్రమ్ కు 30 కోట్లు ఇస్తే అక్కడికే 100 కోట్లు అయిపోతుంది. ఇంక మిగిలిన రెమ్యూనిరేషన్లు, 100 నుంచి 120 రోజులు ప్రొడక్షన్ అన్నీ కలిసి మరో వంద కోట్లు దాటేస్తాయి. అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ నే రెండు వందల కోట్లు దాటేస్తుంది. 

ఎంత మార్కెట్ చేసినా 200 కోట్లకు మించి సినిమా మార్కెట్ కావడం కష్టం. మరి హారిక హాసిని లెక్కలు ఎలా వుంటాయో? ఏమిటో కాస్త వేచి వుంటే తెలిసే అవకాశం వుంది.