రాష్ట్రాలు అన్నీ ఒకే బాటలో….జగన్

బహుశా తొలిసారి కావచ్చు. ఆంధ్ర సిఎమ్ జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకే సందేశం పంపించారు. ఈ మేరకు ఆయన ఒక కామన్ లెటర్ పంపించారు. కోవిడ్ టీకాల విషయంలో రాష్ట్రాలు అన్నీ…

బహుశా తొలిసారి కావచ్చు. ఆంధ్ర సిఎమ్ జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకే సందేశం పంపించారు. ఈ మేరకు ఆయన ఒక కామన్ లెటర్ పంపించారు. కోవిడ్ టీకాల విషయంలో రాష్ట్రాలు అన్నీ ఒకే మాట మీద వుండి, ఆ మేరకే కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నది జగన్ సూచన. 

కరోనా వ్యాక్సీన్ కొరత కారణంగా చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఫెడరల్ సిస్టమ్ నే దెబ్బతినే సూచనలు వున్నాయని, అందువల్ల టోటల్ గా వ్యాక్సీన్ బాధ్యతను కేంద్రమే చేపట్టేలా రాష్ట్రాలు సంయుక్తంగా సూచించాలన్నది జగన్ లేఖ సారాశం. 

తాము గ్లోబల్ టెండర్ పిలిచినా ఒక్క బిడ్ కూడా రాలేదని, పైగా బిడ్లు వచ్చినా ఆమోదించాల్సింది కేంద్రమే అని జగన్ గుర్తు చేసారు. కేంద్రీకృత వ్యాక్సీన్ విధానం వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందని జగన్ సూచించారు.

కానీ అంతా బాగానే వుంది. భాజపాయేతర ప్రభుత్వాలకు ఈ సూచన ఆమోదయోగ్యంగా వుంటుందో? లేక కేంద్రం తరపున జగన్ వకాల్తా తీసుకుని ఈ లేఖ రాసారు అంటాయో? చూడాలి.