బరిలోకి బాలయ్య… ?

నందమూరి బాలక్రిష్ణ సినిమా నటుడు కమ్ పొలిటీషియన్. ఆయన రెండు సార్లు హిందూపురం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇక టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటున్నారు. బాలయ్య ప్రస్తుతం వరసపెట్టి సినిమాలే…

నందమూరి బాలక్రిష్ణ సినిమా నటుడు కమ్ పొలిటీషియన్. ఆయన రెండు సార్లు హిందూపురం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇక టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటున్నారు. బాలయ్య ప్రస్తుతం వరసపెట్టి సినిమాలే చేస్తున్నారు.

ఆయన ఒకదాని తరువాత మరో సినిమా తో బిజీ అవుతున్నారు. అపుడపుడు మాత్రమే ఆయన పొలిటికల్ డైలాగులు పేల్చుతూంటారు. ఒక విధంగా బాలయ్య మీద నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్న విమర్శలు విపక్షాల వైపున  ఉన్నాయి.

సరే అవన్నీ గతం అనుకోవాలేమో. బాలయ్య సరైన టైమ్ చూసి రంగంలోకి దిగిపోతారట. ఈ విషయాన్ని విశాఖ అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ చెబుతున్నారు. బాలయ్య త్వరలోనే రాజకీయాల్లో క్రీయాశీలమవుతారు అంటూ ఆయన హింట్ ఇవ్వడం విశేషమే.

ఒక వైపు టీడీపీ నానాటికీ కృంగిపోతోంది. వరస ఓటములు ఆ పార్టీని పట్టి పీడిస్తున్నాయి. చంద్రబాబుకు వయోభారం, లోకేష్ నాయకత్వం మీద అపనమ్మకంతో క్యాడర్ బెంగటిల్లుతోందని చెబుతారు.  ఈ నేపధ్యంలో నందమూరి వారసుల మీద తమ్ముళ్ల చూపు ఉందన్నది వాస్తవం.

మరి తమ్ముళ్ల ఆశ‌లను నెరవేర్చేదుకుని బాలయ్య కంకణం కట్టుకున్నారా అన్నదే చర్చ. బాలయ్య కనుక సీరియస్ గా బరిలోకి దిగితే రాష్ట్ర రాజకీయాల సంగతేమో కానీ తెలుగు దేశం రాజకీయాల్లో మాత్రం అది పెను సంచలనం కావడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి.