ప్రతి వ్యక్తి తనలో తనకు ఏమిష్టమో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటోంది సమంత. అప్పుడు మాత్రమే జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెబుతోంది. తన విషయానికొస్తే.. తనలో తనకు 3 ఫీచర్లు అంటే ఇష్టం అని చెబుతోంది.
తన నవ్వు, కళ్లు, తన శారీరక బలం అంటే తనకు ఎంతో ఇష్టమంటోంది సమంత. ప్రేక్షకులకు తనలో చాలా క్వాలిటీస్ నచ్చి ఉండొచ్చని, తనకు మాత్రం ఈ మూడంటే ఇష్టం అంటోంది.
ఈ కరోనా కష్టకాలంలో శారీరంగా ఫిట్ గా ఉండడంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం అంటోంది సమంత. మనం ఎంత ఆనందంగా ఉంటే, శరీరకంగా కూడా అంతే ఫిట్ గా ఉంటామని చెబుతోంది. అందుకే తను వ్యాయామంతో పాటు యోగాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెబుతోంది.
ఇక భర్త నాగచైతన్యకు సంబంధించి మరో విషయాన్ని బయటపెట్టింది సమంత. తామిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని, కానీ ముందుగా తనే కాంప్రమైజ్ అవుతానని అంటోంది. ఎందుకంటే తనకు సిగ్గులేదని సరదాగా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం సినిమా మాత్రమే ఉంది. ఆమె సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. దీంతో పాటు ఆమె చేసిన ది ఫ్యామిలీ మేన్ సీజన్-2 ఈనెలలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది.