హీరోలు ఖాళీ లేరు. అడ్వాన్స్ లు ఇచ్చేసి చాలాకాలం అయింది. మరి నిర్మాతలు ఏం చేయాలి. వెనక్కు తీసుకోవడం తప్ప మరో దారిలేదు. మైత్రీ మూవీస్ సంస్థ ఇప్పుడు అదే చేస్తోందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విషయం ఏమిటంటే, మైత్రీ మూవీస్ సంస్థ చాలా మందికి ఇచ్చినట్లే దర్శకుడు బోయపాటి కి కూడా అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు బోయపాటికి హీరో లేరు.
వినయ విధేయ విడుదలై, ఫలితం తేలిన తరువాత మైత్రీ జనాలు బోయపాటిని కలిసి తమ అడ్వాన్స్ వెనక్కు ఇవ్వమని అడిగినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. మొత్తం వడ్డీతో కలిపి ఆరుకోట్లు అయినట్లు లెక్క చెప్పినట్లు తెలుస్తోంది. హీరోలు అందుబాటులో లేనిదే తానేం చేస్తానని బోయపాటి అన్నట్లు, అందుకే అడ్వాన్స్ ఇచ్చేయమని మైత్రీ అడిగినట్లు గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.
బోయపాటి ప్రస్తుతం బాలయ్య సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఎవరితో అన్నది ఇంకా క్లారిటీలేదు. బాలయ్య సినిమా ఫలితం మీదనే ఏదయినా ఆధారపడి వుంటుంది. నిర్మాత కేఎల్ నారాయణ, గీతా అడ్వాన్స్ లు కూడా బోయపాటి దగ్గర వున్నాయి.