చైనా రివర్స్ గేర్

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్ లైన్ ఎక్కడ చేజారిపోతుందో అని చైనా కిందా మీదా అయిపోతోందట. అదీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. Advertisement నిజానికి జనాభా పెరిగిపోతోందని కిందా మీదా…

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్ లైన్ ఎక్కడ చేజారిపోతుందో అని చైనా కిందా మీదా అయిపోతోందట. అదీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్.

నిజానికి జనాభా పెరిగిపోతోందని కిందా మీదా పడిపోయి ఒకప్పుడు రెండో బిడ్డను కనడానికి వీల్లేదని కఠినమైన నిబంధనలు పెట్టింది ఈ దేశమే. జనాభా పెరుగుదల అనర్ధదాయకం అని మన దేశం కూడా అదే బాట పట్టింది. అయితే అంత కఠిన నిబంధనలు విధించలేదు అనుకోండి.

ఇప్పుడు చైనా జనాభా 141 కోట్ల రేంజ్ లో వుంటే భారత్ జనాభా దానికి కాస్త దిగువగా 139 కోట్ల దగ్గర వుంది. పైగా చైనాలో వృద్దుల మరణాల రేటు పెరుగుతోందట. పిల్లల జననాల రేటు తగ్గుతోందట. ఇలా అయితే అత్యధిక జనాభా టైటిల్ చేజారిపోతుందని చైనా ఇప్పుడు ఇద్దరు పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తోంది. 

అవును..ఇంతకీ జనాభా తగ్గితే మంచిదేగా..చైనా బాధేంటీ? అసలు విషయం ఏమిటంటే చైనాకు దాని జనాభానే వరం. అత్యధిక జనాభా వల్ల మ్యాన్ పవర్ అన్నది దానికి కలిసివచ్చింది. 

ప్రపంచదేశాలన్నీ అక్కడ ఫ్యాక్టరీలు, ప్రొడక్షన్ హవుస్ లు పెట్టి, తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో ప్రొడక్షన్ సాగిస్తున్నాయి. ఎప్పుడయితే జనాభా తగ్గిపోతుందో. మ్యాన్ పవర్ అవైలబులిటీ తగ్గుతుంది. మ్యాన్ పవర్ ను వాడుకునే చైనా వండర్లు చేస్తోంది. ఆ అవకాశం భవిష్యత్ లో చేజారిపోతుందేమో అని భయపడుతోంది.

అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు, రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు, మరో పాతికేళ్ల తరువాత సంగతి.అయితే చైనా ముందు చూపుతో, ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలని కిందా మీదా పడుతోంది. అంటే రివర్స్ గేర్ వేస్తోందన్నమాట.