హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీకి, టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఏమైనా లింక్ ఉందా? వీళ్లిద్దరూ ఎప్పుడైనా కలిశారా? కలిసి సినిమా చేశారా? కనీసం కలిసి ఫొటో దిగారా? ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. కానీ ఏంజెలినా జోలీ బెడ్ పై పూరి జగన్నాధ్ వాలిపోయాడు.
పూరి జగన్నాధ్ కు ఏంజెలినా జోలీ అంటే పిచ్చి. ప్రపంచంలోనే ఆమె అంత అందగత్తె లేదంటాడు. ఒకానొక సందర్భంలో ఏంజెలినాపై తనకున్న ప్రేమను కూడా బయటపెట్టాడు. అలాంటి వ్యక్తి ఓసారి వెనిస్ వెళ్లాడు. ఏంజెలినా జోలీ బెడ్ పై వాలిపోయాడు.
“ఓసారి నేను వెనిస్ వెళ్లాను. టూరిస్ట్ అనే సినిమా కోసం వెనిస్ వచ్చిన ఏంజెలినా జోలీ అప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్లిందని తెలిసింది. వెంటనే నేను అదే హోటల్ కు వెళ్లి, షూటింగ్ కోసం రూమ్ కావాలని మేనేజర్ కు అబద్ధం చెప్పి, ఆమె రూమ్ కు వెళ్లి, మేనేజర్ తో సొల్లు మాట్లాడుతూ ఆమె పడుకున్న మంచంపై కాసేపు కూర్చొని వచ్చాను.”
అలా ఏంజెలినా బెడ్ పై తను కాసేపు కూర్చున్నానని.. తనకు అదో తృప్తి అని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాధ్. వెనిస్ ఉన్న ఆ హోటల్ పేరు డానియలీ. మార్క్ స్క్వేర్ పక్కనే ఆ హోటల్ ఉంటుంది.