బన్నీ.. మహేష్ లకు నో ఇన్విటేషన్?

రమా.. రాజమౌళి కుమారుడు కార్తీక్ వివాహానికి పింక్ సిటీ జైపూర్ వేదికగా మారింది. రాజమౌళి సర్కిల్ అనే పలువురు హీరోలు, హీరోయిన్లు, సినిమా సెలబ్రిటీలు ఛలో అంటూ జైపూర్ వెళ్లిపోయారు. మరి కొంతమంది వెళ్తున్నారు.…

రమా.. రాజమౌళి కుమారుడు కార్తీక్ వివాహానికి పింక్ సిటీ జైపూర్ వేదికగా మారింది. రాజమౌళి సర్కిల్ అనే పలువురు హీరోలు, హీరోయిన్లు, సినిమా సెలబ్రిటీలు ఛలో అంటూ జైపూర్ వెళ్లిపోయారు. మరి కొంతమంది వెళ్తున్నారు. ఇంకా వెళ్లాల్సిన వారూ వున్నాయి. అయితే ఈ జాబితో ఎక్కడా కనిపించని హీరోలు ఇద్దరు వున్నారు. ఒకరు మహేష్ బాబు. మరొకరు అల్లు అర్జున్.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా ప్రకారం రాజమౌళి ఫ్యామిలీ నుంచి మహేష్ కు, బన్నీకి ఇన్విటేషన్ అందలేదని తెలుస్తోంది. మహేష్ దుబాయ్ వెళ్లిపోయారు. వాస్తవానికి విదేశానికి వెళ్లిన మహేష్ ఇండియాకు ఈ టైమ్ కు రావాల్సి వుందని, కానీ మధ్యలో మనసు మార్చుకుని దుబాయ్ వెళ్లారని వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి, అల్లు అరవింద్ కు ఇన్విటేషన్లు అందాయని, బన్నీకి మాత్రం రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం కూడా అక్కడే వినిపిస్తోంది. రాజమౌళి తన సన్నిహితులను, తనతో అనుబంధం బాగా పెనవేసుకున్నవారిని మాత్రమే జైపూర్ కు ఆహ్వానించారని, మిగిలిన వారిని హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు పిలిచారని టాక్ వినిపిస్తోంది. 

ఈ ఏడాది మాకు నచ్చిన బెస్ట్ సినిమా అదే 

ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ