పడి పడి… కాస్ట్ ఫెయిల్యూర్

శర్వానంద్-సాయిపల్లవిల పడి పడి లేచె మనసు సినిమా ఆశించిన విజయం సాధించలేదు. తొలివారం వసూళ్లు ఏడుకోట్ల దగ్గర ఆగాయి. కానీ సినిమాకు అయిన ఖర్చు అన్నీకలిపి 32కోట్లు. అయితే అదృష్టం ఏమిటంటే ముందుగానే శాటిలైట్,…

శర్వానంద్-సాయిపల్లవిల పడి పడి లేచె మనసు సినిమా ఆశించిన విజయం సాధించలేదు. తొలివారం వసూళ్లు ఏడుకోట్ల దగ్గర ఆగాయి. కానీ సినిమాకు అయిన ఖర్చు అన్నీకలిపి 32కోట్లు. అయితే అదృష్టం ఏమిటంటే ముందుగానే శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ ద్వారా సగానికి పైగానే రికవరీ అయిపోవడం.

సినిమాలు కొనడం మానేసిన ఏషియన్ సునీల్ ఈ సినిమాకు నాలుగున్నర కోట్లకు నైజాం ఏరియాకు కొనడం మరో ప్లస్. నైజాం, సీడెడ్. అదర్ ఏరియాస్ ఓవర్సీస్, శాటిైలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ కలిపి 28కోట్ల వరకు రికవరీ వచ్చింది.

కానీ సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఆంధ్ర ఏరియా చివరి నిమిషంలో నేరుగా విడుదల చేసుకోవాల్సి రావడం. అక్కడ ఓ రెండుకోట్ల వరకు టోటల్ గా రికవరీ వచ్చేలా వుంది. సీడెడ్, నైజాంల్లో కాస్త వెనక్కు ఇవ్వాల్సి వచ్చినా, టోటల్ గా నిర్మాతకు ఓ నాలుగుకోట్ల వరకు లాస్ వుంటుంది.

టోటల్ గా చూసుకుంటే పడి పడి లేచె మనసు కనుక 25 కోట్ల రేంజ్ లో ఫినిష్ చేసి వుంటే అందరూ ఫుల్ సేఫ్ జోన్ లో వుండివుండేవారు. కానీ డైరక్టర్ హను రాఘవపూడి 30 కోట్లకు పైగా ఖర్చు డేకించేయడంతో, సమస్య తప్పలేదు.

చివరి నిమిషంలో కూడా ఓ సాంగ్ కు డైరక్టర్ కోటి రూపాయలు ఖర్చు చేయించేసినట్లు తెలుస్తోంది. కానీ మళ్లీ ఆ పాటను ఎడిటింగ్ లో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే భూకంపం సెట్ పేరిట భారీగా ఖర్చు చేయించినట్లు, వర్కింగ్ డేస్ భారీగా పెంచేసినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.

ఈ ఏడాది మాకు నచ్చిన బెస్ట్ సినిమా అదే 

ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ