హిట్ తొలి రోజు..జస్ట్ ఓకె

నాని సమర్పణలో, ప్రశాంతి నిర్మించిన సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ధ్రిలర్ సినిమా ఇది. రీజనబుల్ బజ్ తో విడుదలయిన ఈ మూవీకి లిమిటెడ్ స్క్రీన్ లే దక్కాయి. ముఖ్యంగా అలవైకుంఠపురములో,…

నాని సమర్పణలో, ప్రశాంతి నిర్మించిన సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ధ్రిలర్ సినిమా ఇది. రీజనబుల్ బజ్ తో విడుదలయిన ఈ మూవీకి లిమిటెడ్ స్క్రీన్ లే దక్కాయి. ముఖ్యంగా అలవైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరు సినిమాలు యాభై రోజుల కోసం థియేటర్లలో వుండిపోవడం, భీష్మ ఇంకా రెండో వారమే కావడంతో థియేటర్లు అంతగా దొరకలేదు. 

దాంతో తొలి రోజు ఓ మాదిరిగా అంకెలు కనిపిస్తున్నాయి.  నైజాం, వైజాగ్ కలిపి రెండు కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. ఈ రెండు కలిపి తొలి రోజు వన్ థర్డ్ రికవరీ వచ్చింది. ఆంధ్ర రెండు కోట్ల రేషియోలో ఇచ్చారు. తొలి రోజు యాభై వరకు వెనక్కు వచ్చింది. అందువల్ల బయ్యర్లు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు.

Nizam – 65L
Ceeded – 8L
UA – 11L
East – 4.74L
West – 5.81L
Krishna – 7.96L
Guntur – 15.50L
Nellore – 3.70L