రుహానీ డిమాండ్ మామూలుగా లేదు?

తొలి సినిమా చి.ల.సౌ మంచి సినిమా అనిపించుకుంది. అలా అని మరీ పెద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అలాగే ఆ సినిమాలో నటించిన రుహానాశర్మకు పెద్దగా చాన్సలు కూడా వెదుక్కుంటూ రాలేదు. ఆఖరికి ఓ…

తొలి సినిమా చి.ల.సౌ మంచి సినిమా అనిపించుకుంది. అలా అని మరీ పెద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అలాగే ఆ సినిమాలో నటించిన రుహానాశర్మకు పెద్దగా చాన్సలు కూడా వెదుక్కుంటూ రాలేదు. ఆఖరికి ఓ సినిమా వచ్చింది. నాని నిర్మించిన హిట్ సినిమాలో చాన్స్ వచ్చింది. దానికి గాను 13లక్షలు పేమెంట్ అందినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

అసలే చిన్న, మిడిల్ రేంజ్ హీరోయిన్ల కొరతతో కిందా మీదా అవుతున్న ఇండస్ట్రీ కన్ను రుహానీ మీద పడింది. దాంతో ఆమెను తమ తమ సినిమాల్లోకి తీసుకోవాలి అనుకుంటే, ఆమె చెబుతున్న పారితోషికం షాక్ ఇస్తోందని బోగట్టా.

ఏకంగా ముఫై లక్షలు రెమ్యూనిరేషన్ కావాలని రుహాని కోరుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆమెను తీసుకోవాలని అనుకుంటున్న నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. పోనీ చేసిన రెండు సినిమాల్లో అద్భుతమైన పాత్రలు దొరికాయి, మాంచి గుర్తింపు వచ్చింది. కమర్షియల్ హీరోయిన్ టచ్ వచ్చిందా? అంటే అదీ లేదు. హిట్ సినిమాలో రుహానీ పాత్ర కూడా అంతంత మాత్రం. అది కూడా జనాలకు అంతగా రీచ్ కాలేదు. 

కానీ హీరోయిన్ కొరత అలావుంది. దానికి తగినట్లు డిమాండ్ అలా వుంది.

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం