బంగార్రాజుకు మార్గం సుగమం

గత ఏడాది కాలంగా పెండింగ్ లో వున్న ప్రాజెక్టు బంగార్రాజు. రకరకాల కారణాలు ఈ సినిమాను అలా వెనక్కు నెడుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆఖరికి ఈ ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్లబోతోంది. జూన్ నుంచి…

గత ఏడాది కాలంగా పెండింగ్ లో వున్న ప్రాజెక్టు బంగార్రాజు. రకరకాల కారణాలు ఈ సినిమాను అలా వెనక్కు నెడుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆఖరికి ఈ ప్రాజెక్టు సెట్ మీదకు వెళ్లబోతోంది. జూన్ నుంచి ఈ సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లడానికి అన్నీ సన్నాహాలు జరుగుతున్నట్లు బోగట్టా.

నాగార్జున, రమ్యకృష్ణ, నాగ్ చైతన్య ఇఫ్పటికి ఫిక్స్ అయిన స్టార్ కాస్ట్. ఇక చైతూ పక్కన హీరోయిన్ కావాలి. అది రష్మిక నా? మరొకరా? అన్నది ఫైనల్ కావాల్సి వుంది. ప్రస్తుతం నాగ్ చేస్తున్న వైల్డ్ డాగ్, చైతూ చేస్తున్న లవ్ స్టోరీ పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. బహుశా ఈ సినిమాతో పాటు నాగేశ్వరరావు సినిమాను కూడా చైతూ సమాంతరంగా చేసే అవకాశం వుంది.

మనం తరువాత తండ్రీ కొడుకులు నాగ్-చైతూ కలిసి చేసే సినిమా మళ్లీ బంగార్రాజే. అలాగే శైలజరెడ్డి అల్లుడు తరువాత రమ్యకృష్ణ-చైతూ కలిసి చేసే సినిమా కూడా ఇదే.అన్నపూర్ణ బ్యానర్ లో  రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్