లక్ష్మీపార్వతి అంటే బహుశా తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె తెలుగు జాతి నిలువెత్తు సంతకం లాంటి నందమూరి తారక రామారావు సతీమణిగా జన సామాన్యానికి బాగా తెలుసు. అయితే ఆమె ఉన్నత విద్యావంతురాలు. సాహితీవేత్త అన్నది మేధావులకు మాత్రమే తెలుసు
విశాఖలో లక్ష్మీపార్వతి సాహితీ సభల్లో పాలుపంచుకోవడం ద్వారా తనా వైదుష్యాన్ని చాటి చెప్పి అందరికీ అబ్బురపరచారు. అంతే కాదు, ఆమె తెలుగు సాహిత్యం లోతుల్లోకి వెళ్ళి మన సాహిత్యం ప్రపంచంలో ఇపుడు ఏ దశలో ఉంది చెప్పి మరీ భాషాభిమానుల కళ్ళు తెరిపించారు.
ఇదిలా ఉండగా లక్ష్మీపార్వతికి విశాఖ రాజధాని అవుతున్న వేళ కొత్త ఉద్యోగం కూడా అక్కడే వచ్చేసింది. అతి పురాతనమైన ఆంధ్రాయూనివర్శిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆమెను ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఆహ్వానించారు.
దానికి ఆమె సమ్మతించడమే కాదు, తనకు బోధన అంటే చాలా ఇష్టమని చెప్పారు. తప్పకుండా ఏయూ విద్యార్ధులకు పాఠాలు బోధిస్తానని ఆమె చెప్పడం విశేషమే.
మొత్తానికి అన్న గారి సతీమణి విశాఖలో అధ్యాపకురాలిగా ఇకపైన దర్శనమిస్తరన్నమాట. ఇప్పటికే తెలుగు అకాడమీ చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఆమెను నియమించిన సంగతీ తెలిసిందే. విశాఖ అద్భుత నగరమని, దీన్ని మరింతగా ముఖ్యమంత్రి జగన్ అభివ్రుధ్ధి చేస్తున్నారని లక్ష్మీపార్వతి కొనియాడడం కూడా గమనార్హం.