మీ టూ.. ఇవన్నీ తేలేవేనా..?

మీ టూ వ్యవహారాలు చట్టపరమైన పోరాటాల టర్న్ తీసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా ఎదురుదాడి చేస్తున్నారు. తాము అలాంటి వాళ్లం కాదని, తమపై తప్పుడు ఆరోపణలను చేస్తున్నారని మండి పడుతున్నారు. ఎవరికి…

మీ టూ వ్యవహారాలు చట్టపరమైన పోరాటాల టర్న్ తీసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా ఎదురుదాడి చేస్తున్నారు. తాము అలాంటి వాళ్లం కాదని, తమపై తప్పుడు ఆరోపణలను చేస్తున్నారని మండి పడుతున్నారు. ఎవరికి వారు లీగల్ నోటీసులతో స్పందించేస్తూ ఉండటం ఇక్కడ గమనార్హం.

ముందుగా తనుశ్రీ దత్తా ఈ వ్యవహారాన్ని హీటెక్కించింది. ఆమె నానా పటేకర్ మీద ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై లీగల్ నోటీసులతో స్పందించాడు నానా. అతడు మాత్రమే కాదు..తనుశ్రీ చేత ఆరోపణలు ఎదుర్కొన్న మరో దర్శకుడు కూడా ఇదే పని చేశాడు. లీగల్ నోటీసులు అన్నాడు. అలాగే అలోక్ నాథ్ పరువునష్టం దావాను కూడా వేశాడు. ఒక రూపాయి పరిహారాన్ని క్షమాపణలను చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ పిటిషన్లో ఆయన భార్య కూడా ఇంప్లీడ్ కావడం గమనార్హం.

అవి మాత్రమే కాదు.. దక్షిణాది మీ టూ వ్యవహరాలు కూడా కోర్టులకే చేరుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ మీద నటి శ్రుతిహరిహరన్ ఆరోపణలు చేసింది. రొమాంటిక్ సీన్ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. ఫోర్ ప్లే చేద్దామా.. అన్నాడని ఆమె అంటోంది. రెండేళ్ల కిందట ఈ సంఘటన జరిగిందని ఆమె వ్యాఖ్యానించింది. దీనిపై భారీ స్పందనే వచ్చింది.

అర్జున్ కు మద్దతుగా కొంతమంది మాట్లాడారు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై అర్జున్ కూడా కోర్టును ఆశ్రయించాడు. ఏకంగా ఐదు కోట్ల రూపాయల పరువునష్టం దావాను దాఖలు చేశాడు. అంటే యాభై లక్షల రూపాయల మొత్తాన్ని కోర్టు కు కట్టి ఐదు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసినట్టే. ఈ విధంగా అర్జున్ గట్టి పోరాటమే మొదలుపెట్టగా.. ఇప్పుడు శ్రుతి హరిహరన్ వెళ్లి కేసు పెట్టింది. బెంగళూరులోని ఒక పోలిస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. అర్జున్ తనతో అనుచితంగా ప్రవర్తించిన వైనాన్ని వివరించి ఫిర్యాదు చేసింది.

అటు కోర్టు నోటీసులు, ఇటు ఫిర్యాదులు. తనుశ్రీ దత్త మీదకు నానా తదితరులు కోర్టు నోటీసులు ఇవ్వగా వారిపై ఆమె పాత వ్యవహారాల గురించి పోలిస్ కంప్లైంట్లు ఇచ్చింది. మరి ఇవన్నీ తేలేవేనా?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి