టీసిరీస్ కు ఇచ్చేది లేదు?

కేవలం సినిమా  లైన్ కొద్దిగా వాడుకునే  హక్కుల కోసం భాగస్వామ్యం ఇవ్వడమా? నో..వే.. Advertisement ఇదీ, బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు పీట ముడిగా మారిన సంగతి. సినిమాను జిరాక్స్ గా తీయకుండా కేవలం హిందీ సినిమా…

కేవలం సినిమా  లైన్ కొద్దిగా వాడుకునే  హక్కుల కోసం భాగస్వామ్యం ఇవ్వడమా? నో..వే..

ఇదీ, బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు పీట ముడిగా మారిన సంగతి. సినిమాను జిరాక్స్ గా తీయకుండా కేవలం హిందీ సినిమా లైన్ మాత్రమే వాడుకునేందుకు, సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం, లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఇటు గీతా వర్గాలు కానీ, అటు హారిక హాసిన వర్గాలు కానీ పూర్తిగా నిరాసక్తతతో వున్నట్లు తెలుస్తోంది.

దీనిపైనే డిస్కషన్లు సాగుతున్నాయి. ఎలాగోలా టీ సిరీస్ ను హక్కుల విక్రయం కోసం ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. కాని పక్షంలో వేరే కథతోనే ముందుకు వెళ్లే ఆలోచనే త్రివిక్రమ్ లో వుందని తెలుస్తోంది.

వాస్తవానికి త్రివిక్రమ్ హిందీ సినిమాలోంచి జస్ట్ లైన్ మాత్రం తీసుకుని కొత్తగా టోటల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అజ్ఞాతవాసి మాదిరిగా లేనిపోని సమస్య ఎందుకని, హక్కుల కోసం ట్రయ్ చేసారు. కానీ టీ సీరీస్ నిర్మాణ భాగస్వామ్యం కావాలంటోంది.

అయితే గియితే, వేరే కథతో వెళ్లిపోదాం కానీ, టీసిరీస్ భాగస్వామ్యం వద్దు అనే విషయంలో ఇటు దర్శకుడు, అటు హీరో టీమ్ ఫర్మ్ గా వుండిపోయినట్లు వినిపిస్తోంది. అందువల్ల ఈ పీటముడి ఇప్పట్లో విడదని, కనీసం నాలుగయిదురోజలు పడుతుందని వినిపిస్తోంది.