మహేష్ అటు.. రావిపూడి ఇటు

అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉండేది. కృష్ణకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాతకు మహేష్ బాబు కాల్షీట్లు ఇచ్చాడు. ఈ మేరకు సదరు…

అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉండేది. కృష్ణకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాతకు మహేష్ బాబు కాల్షీట్లు ఇచ్చాడు. ఈ మేరకు సదరు నిర్మాత అనీల్ రావిపూడికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. మరోవైపు హీరోయిన్ గా కృతి షెట్టితో సంప్రదింపులు కూడా షురూ చేశారు.

అంతా సెట్ అవుతుందనుకున్న టైమ్ లో త్రివిక్రమ్ ఎంటరవ్వడం, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు అనీల్ రావిపూడి మరోసారి బాలకృష్ణ వైపు మొగ్గుచూపాడు.

బాలయ్య-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. చాన్నాళ్లుగా నలుగుతున్న ప్రాజెక్టు ఇది. బాలయ్య కోసం రావిపూడి దగ్గర ఓ లైన్ ఎప్పట్నుంచో సిద్ధంగా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు ప్రాజెక్టు డిలే అవ్వడంతో, బాలయ్య వైపు చూస్తున్నాడు అనీల్ రావిపూడి.

ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టు డిస్కషన్ స్టేజ్ లో ఉంది. బాలయ్య ఓకే చెప్పడం లాంఛనప్రాయమే. కాకపోతే బ్యానర్ ఏంటనేది తేలాల్సి ఉంది. ఈ సినిమా చేయాలంటే, దిల్ రాజు కాంపౌండ్ నుంచి అనీల్ రావిపూడి బయటకురావాలి. 

ఎందుకంటే ఎఫ్3 తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే అనీల్ మరో సినిమా చేయాల్సి ఉంది. అది ఇప్పట్లో సాధ్యమా అనేది ఆలోచించాల్సిన విషయం.