విజయ్ సరసన అనన్య పాండే

పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ ల క్రేజీ ప్రాజెక్టు హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఈ రోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. బాలీవుడ్ లో జస్ట్ మూడు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్న అనన్య పాండే ను హీరోయిన్…

పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ ల క్రేజీ ప్రాజెక్టు హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఈ రోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. బాలీవుడ్ లో జస్ట్ మూడు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్న అనన్య పాండే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.  ఈ మధ్యనే తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుందీ అమ్మాయి. 

ఈ 22 ఏళ్లు ముద్దుగుమ్మ ఎవరో కాదు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సాధించింది. హీరోయిన్లను ఎంపిక చేయడంలో పూరికి మంచి టేస్ట్ వుంది. విజయ్ దేవరకొండతో పూరి పక్కా హిందీ సినిమా చేస్తున్నారు. దాన్ని తెలుగులో డబ్ చేస్తారు. కానీ తెలుగు వారి సినిమా కాబట్టి స్ట్రయిట్ సినిమా కలరింగ్ వస్తుంది.

అందుకే కాంటెంపరరీ హీరోయిన్ వుండాలని ఫిక్స్ అయ్యారు. అనన్యను తీసుకున్నారు. ఈ సినిమాలో విజయ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపిస్తాడు. పూరి సినిమా కథకు, గతంలో వచ్చిన అమ్మ..నాన్న..తమిళ అమ్మాయి కథకు పోలికలు వున్నాయని గ్యాసిప్ లు వున్నాయి. కానీ నిజం తెలియాల్సి వుంది.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్