అనిల్ రావిపూడికి కరోనా

కరోనా కల్లోలం ఎవర్నీ వదలడం లేదు. ప్రతి ఇంటిని టచ్ చేస్తోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడికి కూడా కరోనా సోకినట్లు బోగట్టా.  Advertisement దగ్గు, జలుబు ఎక్కువగా వుండడంతో టెస్ట్…

కరోనా కల్లోలం ఎవర్నీ వదలడం లేదు. ప్రతి ఇంటిని టచ్ చేస్తోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడికి కూడా కరోనా సోకినట్లు బోగట్టా. 

దగ్గు, జలుబు ఎక్కువగా వుండడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు.

ప్రస్తుతం జరగాల్సిన ఎఫ్ 3 షెడ్యూళ్లు అన్నీ క్యాన్సిల్ చేసారు. వెంకటేష్, వరుణ్ తేజ్ తదితరుల డేట్ లు అన్నీ ఈ సినిమా కోసం వున్నాయి. కానీ పరిస్థితి ఇలా వుండడంతో క్యాన్సిల్ చేయకతప్పలేదు. పైగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా వకీల్ సాబ్ హడావుడి నుంచి తేరుకుని ప్రస్తుతం విశ్రాంతిలో వున్నారు.

టాలీవుడ్ లో చాలా మంది టెక్నీషియన్లు, నటీనటులు, జర్నలిస్ట్ లు కరోనా బారిన పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా వుంది. లెక్కకు రోజుకు నాలుగు వేల కేసులు కనిపిస్తున్నాయి కానీ వాస్తవ పరిస్థితి చూస్తుంటే అంతకు పదింతలు వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.