మొత్తానికి అరవింద్ ‘అల’

అల వైకుంఠపురం హిందీ వ్యవహారం తెగింది. రైట్స్ అమ్మేద్దాం, ఏడు కోట్ల పైచిలుకు మొత్తం అంటే మంచి రేటు అనుకున్న త్రివిక్రమ్-హారిక హాసిని రాధాకృష్ణను గీతా అరవింద్ ఒప్పించగలిగారు. అందరం కలిసి హిందీలో రీమేక్…

అల వైకుంఠపురం హిందీ వ్యవహారం తెగింది. రైట్స్ అమ్మేద్దాం, ఏడు కోట్ల పైచిలుకు మొత్తం అంటే మంచి రేటు అనుకున్న త్రివిక్రమ్-హారిక హాసిని రాధాకృష్ణను గీతా అరవింద్ ఒప్పించగలిగారు. అందరం కలిసి హిందీలో రీమేక్ చేసుకుందాం అని అంగీకరింపచేసారు.

అల సినిమాను హిందీలో అల్లు అరవింద్, త్రివిక్రమ్, హారిక హాసిని కలిసి నిర్మిస్తారు. కబీర్ సింగ్ ను నిర్మించిన నిర్మాతల్లో కొందరు ఈ ఫ్రాజెక్టుల్లో భాగస్వాములుగా వుంటారు. అరవింద్ 25శాతం, హారిక పాతిక శాతం, త్రివిక్రమ్ యాభైశాతం ఒకవైపు వాటాలుగా వుంటాయి. ఆపైన బాలీవుడ్ నిర్మాతలు కూడా వుంటారు. 

కథను బాలీవుడ్ కు అనుగుణంగా కాస్త మల్టీస్టారర్ లుక్ వచ్చేలా మారుస్తారు. ప్రస్తుతం అరవింద్-దిల్ రాజు-సితార కలిసి బాలీవుడ్ నిర్మాతలతో చేస్తున్న జెర్సీ రీమేక్ తరువాత ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయాలనే అల్లు అరవింద్ అల వైకుంఠపురం ప్రాజెక్టును కూడా అటు తీసుకెళ్తున్నారు.