జీవితమైనా, సినిమా అయినా వైవిధ్యం ఉండాలి. రొటీన్ పాత్రలే అంటే కాసింత బోర్‌గా ఫీల్ అవుతారు. బుల్లి తెరపై తన మాటలతో, అల్లరితో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన యాంకర్ అనసూయ భరద్వాజ్ వెండితెరపై కూడా కొంత కాలంగా తళుక్కుమంటున్న విషయం తెలిసిందే.
తక్కువ సినిమాలే చేసినా….గుర్తుండిపోయే పాత్రల్లో నటించారామె. ముఖ్యంగా సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా అందరినీ మెప్పించారు. ఆ సినిమాతో అనసూయ క్రేజీ అమాంతం పెరిగిపోయింది.
వరుస ఆఫర్లు వచ్చాయి. బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై మెరిసింది. ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా' సినిమాలో కీలకపాత్ర పోషించారు.
ఈ ఏడాది అనసూయ ఓ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ సినిమాలో అనసూయకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇందులో అనసూయ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అంటే రంగమ్మత్త ఇక రౌడీరాణిగా కనిపించనుంది. ఆమె పాత్రపై త్వరలో స్పష్టత రానుంది.