పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్. ఆయన కమ్ బ్యాక్ సినిమా అంటే ఆ లెక్కే వేరు. కానీ అలాంటి సినిమాకు హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అంటే మాత్రం ఆసక్తి చూపించడం లేదు బయ్యర్లు అని తెలుస్తోంది. దీనికి కారణం ఆ సినిమా బాలీవుడ్ సినిమా రీమేక్ కావడం, అలాగే తమిళంలో కూడా ఇప్పటికే వచ్చేయడం. ఈ రెండు సినిమాల వెర్షన్లు ఇప్పటికే చాలా మంది చూసేసారు. రెండు పాపులర్ సినిమాలే.
అందువల్ల ఎంత మార్పులు చేసినా, రేటు ఇవ్వడం కష్టమన్నది బయ్యర్ల అభిప్రాయంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. శాటిలైట్ సంగతి పక్కన పెడితే, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ వస్తుందనుకున్నారని, కానీ ఆ మేరకు ఎంక్వయిరీలు రావడం లేదని తెలుస్తోంది.
ఓ మీడియం సినిమాకు పలికిన రేటు మాదిరిగా జస్ట్ అయిదు కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. మరి ఇలా అయిదు కోట్ల దగ్గర ప్రారంభమైన బేరం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. నిర్మాత దిల్ రాజు పలుకుబడి, ఆయన సినిమాలు అన్నీ కలిపి రేటు లాగాలేమో కానీ, బయ్యర్ల సైడ్ మాత్రం పెద్దగా రేటు పలకడం లేదని ముంబాయి వర్గాల బోగట్టా.