భీష్మ క్రేజీ బిజినెస్ క్లోజ్

భీష్మకు క్రేజీ బిజినెస్ అంటే పదుల కోట్లు వందల కోట్లు అన్నది కాదు క్వశ్చను. ఒక్కో ఏరియా కోసం ముగ్గురు నలుగురు పోటీపడడం. వత్తిళ్లు, మొహమాటాలు. ఇలాంటి అన్నీ వచ్చాయి అంటే క్రేజ్ వున్నట్లేగా.…

భీష్మకు క్రేజీ బిజినెస్ అంటే పదుల కోట్లు వందల కోట్లు అన్నది కాదు క్వశ్చను. ఒక్కో ఏరియా కోసం ముగ్గురు నలుగురు పోటీపడడం. వత్తిళ్లు, మొహమాటాలు. ఇలాంటి అన్నీ వచ్చాయి అంటే క్రేజ్ వున్నట్లేగా. నితిన్ హీరో.  కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకునే చేస్తున్న సినిమా. డైరక్టర్ వెంకీ కుడుమల రెండో సినిమా. సితార బ్యానర్ కు కాస్త వాల్యూ వుంది. దాని పేరెంటెల్ కంపెనీ హారిక హాసినికి రెగ్యులర్ బయ్యర్లు వున్నారు. అందువల్ల నిజానికి బయట వాళ్లకు చాన్స్ వుండదు. అయినా కూడా జనాలు పోటీ పడ్డారు అంటే కాస్త విశేషమే. 

అయితే నిర్మాతలు మాత్రం ఒక్క కృష్ణ మినహా మిగిలిన ఏరియాలు అన్నీ తమ రెగ్యులర్ బయ్యర్లకే ఇచ్చారు. కృష్ణ మాత్రం గీతా సంస్థ నిర్వాహకుడు బన్నీవాస్ కు ఇచ్చారు. ఇంకో విశేషం ఏమిటంటే అలవైకుంఠపురం బ్లాక్ బస్టర్ కావడం, బోలెడు లాభాలు రావడం, హారిక హాసినికి వున్న ట్రాక్ రికార్డు దృష్ట్యా అడ్వాన్స్ లు ఎంత కావాలన్నా వస్తాయి. ఎన్ ఆర్ ఎ అన్నా కూడా భీష్మ బజ్ కు ఆంధ్రనే పది కోట్ల వరకు పలకడానికి కాస్త చాన్స్ వుంది. 

కానీ సినిమాను ఏడు నుంచి ఎనిమిది కోట్ల రేషియోలో ఆంధ్ర ఇచ్చేసారు. నాలుగున్నర కోట్ల కు నైజాం ఇచ్చేసారు. రెండు కోట్లకు పైగా మొత్తానికి సీడెడ్ ఇచ్చారు. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో 14 నుంచి 15 కోట్ల వరకు వచ్చింది. కర్ణాటక, ఓవర్ సీస్, తమిళనాడు ఇలా చిన్నా, పెద్దా అన్నీ కలుపుకుంటే ఇరవై కోట్ల వరకు థియేటర్ రైట్స్ నుంచి వచ్చాయి. 

ఇది కాక నాన్ థియేటర్ నుంచి 15 వరకు వచ్చింది. నాన్ థియేటర్ ఎంత వచ్చినా సమస్య లేదు. హిట్..ఫట్ ల ప్రభావం వుండదు. థియేటర్ ఇరవై అంటే రీజనబుల్ హిట్ అనిపించుకోవాలి. సినిమాకు పబ్లిసిటీ అన్నీ కలిపి 25 కోట్ల వరకు ఖర్చయినట్లు బోగట్టా. ఆ లెక్కన చూసుకుంటే సితార సంస్థకు ఓ పది కోట్ల వరకు లాభంవచ్చినట్లే.

బయ్యర్లు గట్టెక్కిపోతే, సితారకు ఆనందమే. ఓవర్ ఫ్లోస్ వస్తే ఇంకా ఆనందమే.

అయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు